Surabhi: మెగాస్టార్ ‘విశ్వంభర’ హీరోయిన్‌ కి తప్పిన ప్రమాదం !

మెగాస్టార్ ‘విశ్వంభర’ హీరోయిన్‌ కి తప్పిన ప్రమాదం !

Hello Telugu - Surabhi

Surabhi: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’లో కీలక పాత్రలో నటిస్తున్న హీరోయిన్‌ సురభికి(Surabhi) తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఫలితంగా గాల్లో ఉన్న విమానం కంట్రోల్‌ తప్పి కిందపడబోయింది. పైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పి…ఫ్లైట్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ఇదే విషయాన్ని సురభి… తన సోషల్ మీడియా ఇన్‌ స్టా వేదికగా తెలియజేసింది.

Surabhi Luckily Missed Accident

‘నేను విమానంలో ప్రయాణిస్తుండగా ఎప్పుడూ జరగని సంఘటన ఎదురైంది. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను. నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఫ్లైట్ కంట్రోల్ లో లేకుండా పోయింది. నాతో పాటు ఫ్లైట్ లో ఉన్నవాళ్ళంతా చాలా భయపడ్డారు. కానీ పైలెట్ జాగ్రత్త వల్ల సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ ఘటనని ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. చావు నుంచి తప్పించుకున్నాను. జస్ట్ మిస్. ఇలా జరగడంతో నాలో ఉన్న పాజిటివ్ థింకింగ్ మీద నాకు మరింత నమ్మకం పెరిగింది’ అంటూ సురభి పోస్ట్ చేసింది.

బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన సురభి… ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా సురభికి తగిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీనితో ఈ బ్యూటీ కోలీవుడ్‌ కి షిఫ్ట్‌ అయింది. అక్కడ అడపాదడపా సినిమాలు చేస్తోంది. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో బింబిసార ఫేం వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’లో సురభి కీలక పాత్ర పోషిస్తోంది.

Also Read : Game Changer: భారీ ధరకు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ రైట్స్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com