Suriya : తమిళ సినీ నటుడు సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కార్తీక్ సుబ్బరాజ్ ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం రెట్రో. కుటుంబ కథా చిత్రంగా దీనిని తెరకెక్కించాడు. ఇప్పటికే మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు విడుదల చేశారు. అద్భుతమైన ఆదరణ లభించింది అభిమానుల నుంచి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సందర్బంగా మూవీ మేకర్స్ రెట్రో మూవీ ప్రమోషన్స్ ను పెద్ద ఎత్తున చేస్తున్నారు. రెట్రో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో సూర్య(Suriya) ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ తమ హీరోను భిన్నంగా చూపించాడని, ఇక సినిమాకు ఢోకా లేదంటున్నారు. ఇందులో కీ రోల్ పోషించింది బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే.
Hero Suriya Appeal
మూవీ ప్రమోషన్ లో భాగంగా జరిగిన చిట్ చాట్ లో సూర్య(Suriya) కీలక వ్యాఖ్యలు చేశాడు. దయచేసి నేను నటించిన సినిమా చూడక పోయినా తాను ఏమీ అనుకోనని, కానీ దయచేసి ఆరోగ్యాన్ని పాడు చేసే ధూమపానం చేయొద్దంటూ కోరాడు. ఎందుకంటే ఇది మనల్ని పీల్చి పిప్చి చేస్తుందని, సిగరెట్లకు, మద్యానికి దూరంగా ఉండాలని సూచించాడు నటుడు. కథకు అనుగుణంగా రెట్రో చిత్రంలో తాను సిగరెట్ కాల్చాల్సి వచ్చిందని, దీనిని మీరు అనుసరించ వద్దంటూ కోరాడు. ఎప్పటికీ మీరు సిగరెట్లు కాల్చబోమంటూ తనకు మాటివ్వాలని అభిమానులకు విన్నవించాడు.
ఒక్కసారి సిగరెట్లను కాల్చడం మొదలు పెడితే ఇక దానిని ఆపలేరన్నాడు. తొలుత సరదాగా ప్రారంభం అవుతుందని ఆ తర్వాత అలవాటుగా మారి మనల్ని , ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని సర్వ నాశనం చేస్తుందని హెచ్చరించాడు నటుడు సూర్య. తాను కూడా ఆపలేనని చెప్పాడు. ఈ సందర్బంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుపై ప్రశంసలు కురిపించాడు. రెట్రో నా మూవీ కాదు. ఇది పూర్తిగా దర్శకుడికి చెందిన చిత్రం. తన కెరీర్ లో 45 సినిమాలు చేశాను. కానీ ఈ చిత్రం ప్రత్యేకంగా ఉండనుందన్నాడు. భవిష్యత్తులో మరో మూవీ చేయాలని ఉందన్నాడు.
Also Read : Child Actor Bulliraju Sensational :’సింగిల్’ చిత్రం బుల్లిరాజు అద్బుతం
