Prasanth Neel : ప్రశాంత్ నీల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తను తీసింది కొన్ని చిత్రాలే కానీ ఇండియాను షేక్ చేశాడు. తనేమిటో, తన సత్తా ఏమిటో జనాలకు తెలియ చేశాడు. స్టార్స్ అవసరం లేదని, కథలో కంటెంట్ ఉంటే చాలని నమ్మే వ్యక్తుల్లో తను కూడా ఒకడు. అందుకే ఎక్కువగా ప్రచారాన్ని కోరుకోడు. తాను ఏది కావాలని కోరుకుంటాడో అది తెరపై వచ్చేంత వరకు నిద్ర పోడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ నీల్(Prasanth Neel) పని రాక్షసుడు. తను ఇప్పటికే యశ్ తో తీసిన కేజీఎఫ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ తర్వాత ప్రభాస్ తో తీసిన సలార్ దుమ్ము రేపింది.
Prasanth Neel – Jr NTR Dragon Movie
ఇప్పుడు డ్రాగన్ తో రికార్డులను తిరగ రాసేందుకు సమాయత్తం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించాడు. ఇందులో దమ్మున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ కీ రోల్ పోషిస్తున్నాడు. దీనిని భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు జత కట్టారు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ట్. ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. కానీ మార్కెట్ మాత్రం జోరందుకుంది. వచ్చే ఏడాదిలో దీనిని రిలీజ్ చేస్తానని ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక ఎన్టీఆర్ ఇప్పటికే దేవర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీనిని కొరటాల శివ తీశాడు. ఇందులో జాన్వీ కపూర్ నటించింది.
అయితే డ్రాగన్ మూవీని ఓ రేంజ్ లో తీసేందుకు ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇంకా కథ గురించి కానీ, ఎవరు నటిస్తున్నారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ షూటింగ్ కు సంబంధించిన ఫోటోస్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అభిమానులకు మరింత జోష్ తెప్పించేలా చేస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా సినిమాకు సంబంధించి ఓ కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే ముంబైకి చెందిన చిత్ర, మ్యూజిక్ నిర్మాణ సంస్థ టీ సీరీస్ డ్రాగన్ కు సపోర్ట్ చేయనుంది. నిర్మాణ పరంగా. నాన్ థియేట్రికల్ రైట్స్ తో పాటు సినిమాలో కూడా షేర్ తీసుకునేందుకు ఒప్పందం కుదిరినట్లు టాక్.
Also Read : Abir Gulaal Movie Banned : అబీర్ గులాల్ మూవీపై నిషేధం