Tamannaah : బాలీవుడ్ బ్యూటీ తమన్నా భాటియాతో పాటు కాజల్ అగర్వాల్ క్రిప్టో కరెన్సీకి సంబంధించి కేసు నమోదైంది. తమిళనాడులోని పుదుచ్చేరిలో వీరి కారణంగా తాము మోసపోయామంటూ బాధితులు కొందరు పోలీసులను ఆశ్రయించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని సదరు కంపెనీ తరపున ప్రచారం చేశారు. వీరి వల్లనే తాము ఇన్వెస్ట్ చేశామని, కోట్లల్లో పెట్టుబడి పెట్టామని వాపోయారు.
Tamannaah Shocking Comments on The Raja Saab
దీనిపై తీవ్రంగా స్పందించారు తమన్నా భాటియా(Tamannaah). ఆ కేసుతో తనకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. తమను ఎందరో రావాలని పిలుస్తాంటారని, సదరు కంపెనీకి సంబంధించి కార్యక్రమాలలో పాల్గొన్నామని అయినంత మాత్రాన తమను ఎలా బాధ్యులుగా చేస్తారంటూ ప్రశ్నించారు నటి.
నాకు గానీ , కాజల్ అగర్వాల్ కు గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్ని కేసులు నమోదు చేసినా డోంట్ కేర్ అంటోంది బాలీవుడ్ బ్యూటీ తమన్నా భాటియా. దేశంలో ఎందరో ఎన్నో కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ వస్తుంటారని, అన్నింటితో కూడా తమకు సంబంధం ఉదంటూ కేసులు పెట్టుకుంటూ పోతే జీవిత కాలం సరిపోదంటూ సెటైర్ వేశారు. తాజాగా తమన్నాచేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Hero Prabhas-Raja Saab :శరవేగంగా రాజా సాబ్ షూటింగ్