Tamannah Bhatia : ఈ ఏడాది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు బాగా కలిసొచ్చినట్టుంది. అందుకే మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తోంది. పొట్టి దుస్తులతో కుర్ర కారును మతి పోగొట్టేలా చేస్తోంది ఈ అమ్మడు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకుందామని అనుకుంటోంది.
Tamannah Bhatia Viral
ఓ వైపు సినిమాలలో నటిస్తూనే ఇంకో వైపు వెబ్ సీరీస్ లో కూడా తళుక్కుమంటోంది. ఆ మధ్యన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. లస్ట్ స్టోరీస్ పేరుతో తీసిన వెబ్ సీరీస్ లో రెచ్చి పోయింది. హద్దులు దాటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించింది తమన్నా భాటియా(Tamannah Bhatia).
దీంతో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదే సమయంలో క్రియేటివ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కలిసి తమన్నా నటించింది. ఈ చిత్రం బాక్సులు బద్దలు కొట్టింది. ఏకంగా రూ. 600 కోట్లు కొల్లగొట్టింది. దీంతో సూపర్ సక్సెస్ ను తమన్నా ఎంజాయ్ చేస్తోంది.
ఇటు మూవీ అటు వెబ్ సీరీస్ బిగ్ సక్సెస్ అందుకోవడంతో హాలీడ్ వెకేషన్ కోసమని మాల్దీవులకు వెళ్లింది. అక్కడ బికినీలతో దర్శనం ఇచ్చింది. అంతే కాదు సైకిల్ పై ఐస్ క్రీమ్ లను కూడా అమ్మింది. ప్రస్తుతం తమన్నా హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Gadar-2 Director : ఆస్కార్ కు గదర్ -2 ఖాయం
