దేశ వ్యాప్తంగా హనుమాన్ మూవీతో రికార్డ్ బ్రేక్ చేశాడు టాలీవుడ్ కు చెందిన తేజ సజ్జా. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. కార్తీక్ గట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయ్ టీజర్ ను లాంచ్ చేశారు. ఆకట్టుకునేలా ఉంది. టీజీ విశ్వ ప్రసాద్ , కృతి ప్రసాద్ టీజర్ ను ఆవిష్కరించారు.
సాధువు స్వరం తో స్టార్ట్ అవుతుంది టీజర్. తేజ సజ్జా ఇందులో కీ రోల్ పోషించాడు. నిరాడంబరమైన యోధుడిగా కనిపిస్తాడు. ఆధ్యాత్మిక మంత్రదండం పట్టుకుని జవాబు లేని ప్రశ్నలతో నిండిన వ్యక్తిగా మిరాయ్ లో దర్శనం ఇస్తాడు. తన జర్నీ ముగుస్తున్న కొద్దీ తన విధి గురించి కీలకమైన సత్యాన్ని కనుగొంటాడు. తనలో ఉన్న శక్తిని ప్రదర్శించేందుకు ప్రయత్నం చేశాడు తేజ సజ్జా.
ఇక ఇండియన్ సినిమాలో అత్యంత పిన్న వయస్కుడైన హీరోగా తను పేరు పొందాడు. అండర్ డాగ్ టర్న్ సూపర్ యోధగా తెరపై గర్జిస్తాడు. ఉత్కంఠ భరితంగా , అద్భుతంగా సీన్స్ ను తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని.
ఇందులో మరో కీలక పాత్రలో అద్భుతంగా నటించాడు మంచు మనోజ్. చీకటి శక్తులతో భయంకరమైన ప్రతి నాయకుడి పాత్రకు న్యాయం చేశాడని చెప్పక తప్పదు. ఈ టీజర్ లో ఇంకా రితికా నాయక్, శ్రియ శరణ్ , జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. శ్రీరాముడు నడుస్తున్నప్పుడు కోతులు భక్తితో నమస్కరించేలా టీజర్ ను రిలీజ్ చేయడం మరింత ఆకట్టుకునేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
