Coolie : భారత దేశ సినీ చరిత్రలో అత్యంత జనాదరణ పొందిన అరుదైన నటుడు తలైవా రజనీకాంత్. తను ఏది చేసినా అది సంచలనం. ప్రత్యేకించి తన మేనరిజంకు కోట్లాది మంది ఫిదా అయ్యారు. ఆయన నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే దాని కోసం ఎంతో ఉత్కంఠకు లోనవుతున్నారు. గత ఏడాది సూపర్ స్టార్ నటించిన జైలర్ దుమ్ము రేపింది. ఈ ఒక్క మూవీ కోసం తను భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ దయానిధి మారన్ కు చెందిన సన్ పిక్చర్స్ నిర్మించింది.
Coolie Movie Sensational
అత్యధిక వసూళ్లు చేయడంతో ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ భారీ ధర కలిగిన వాహనాలను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు టాలీవుడ్ , కోలీవుడ్ లో రజనీకాంత్ నటించిన కూలీ(Coolie) చిత్రం. ఇప్పటికే పోస్టర్స్, టీజర్ కు బిగ్ రెస్పాన్స్ రావడంతో మరింత డిమాండ్ ఉంటోంది ఈ మూవీని తెలుగు హక్కులు కైవసం చేసుకునేందుకు. తాజాగా టాలీవుడ్ లో పలువురు నిర్మాతలు, సంస్థలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయని వినికిడి. వెట్టియాన్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
తను మంజు వారియర్ తో , తమన్నా భాటియాతో కలిసి చేసిన పాటలకు జనం ఫిదా అయ్యారు. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కూలీ. దీని తెలుగు రైట్స్ కు హెవీ డిమాండ్ ఏర్పడిందని, ఏకంగా రూ. 40 కోట్లు పలుకుతుందని మార్కెట్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తలైవా మజాకా అంటున్నారు సినీ విమర్శకులు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 14న కూలీని విడుదల చేస్తామన్నారు.
Also Read : Hero Adivisesh Major-Japan :29న జపాన్ లో అడవి శేష్ మేజర్ ప్రదర్శన