Thaman S: డల్లాస్‌ లో థమన్ స్పెషల్ మ్యూజికల్ నైట్ !

డల్లాస్‌ లో థమన్ స్పెషల్ మ్యూజికల్ నైట్ !

Hello Telugu - Thaman S

Thaman S: సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ ఎస్ ఎస్ థమన్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్‌ ను ప్లాన్ చేసింది. డల్లాస్‌ వేదికగా అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ స్పైస్ టూర్ జూన్ 1న ప్రారంభమవుతుందని తెలుపుతూ విడుదల చేసిన ప్రోమోలో గుంటూరు కారం నుంచి ధమ్ మసాలా అంటూ థమన్ చేసిన హంగామాను చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇప్పటి వరకు డల్లాస్‌ లో జరగనంతగా… భారీ స్థాయిలో ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనితో ఈ ఈవెంట్‌ కు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

Thaman S Music

దక్షిణాది భాషల్లో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ఎస్ థమన్(Thaman S) ఒకరు. చిన్న, మీడియం నుంచి పాన్ ఇండియన్ ప్రాజెక్టుల వరకు థమన్ చేసిన సినిమాలు మ్యూజిల్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల థమన్… ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. మెలోడీ, మాస్ బీట్‌ లతో థమన్ శ్రోతలను ఆకట్టుకుంటూ… టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం క్షణం కూడా తీరిక లేనంత బిజీగా ఉన్న థమన్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ… ఓ స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్‌ ను ప్లాన్ చేసింది. డల్లాస్‌ వేదికగా నిర్వహించబోయే ఈ మ్యూజికల్ ఈవెంట్ కు ఇప్పటినుండే క్రేజ్ పెరిగిపోతుంది.

Also Read : Bhumi Pednekar: యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌ గా బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com