టాలీవుడ్ లో కొత్త హీరోలు పుట్టుకు వస్తున్నారు. కొన్ని మంచి చిత్రాలు వస్తున్నాయి. ఇంకొన్ని సందేశాత్మకంగా ఉంటున్నాయి. చిన్న చిత్రాలని తీసి పారేసినవి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వాటిలో ఈఏడాది వచ్చిన ప్రదీప్ రంగనాథన్, కయాదు లోహర్ నటించిన డ్రాగన్ దుమ్ము రేపింది. నాని సమర్పించిన , నిర్మించిన కోర్ట్ బిగ్ సక్సెస్ అయ్యింది. ఇంద్రగంటి మోహన కృష్ణ తీసిన మూవీ ఆదరణ చూరగొంది. సినీ నటి సమంత నిర్మించిన చిత్రం శుభం సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు సుమంత్ నటించిన అనగనగా ఓటీటీలో సూపర్ టాక్ తెచ్చుకుంది. మంచి వ్యూయర్ షిప్ ను సాధించింది.
తాజాగా అలాంటి కోవలోకి తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. తన చేతుల మీదుగా యవు నటుడు ధనుష్ నటించిన థ్యాంక్యూ డియర్ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా మూవీ బాగా తీశారంటూ తప్పకుండా ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నటుడికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. మూవీ టీంకు అభినందనలు తెలిపారు.
తమను ప్రోత్సహించడమే కాదు తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు నిర్మాతకు చిత్ర బృందం. సినిమా నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీతో ధనుష్ కు మంచి పేరు రావడం పక్కా అన్నారు. మొత్తంగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు.
