Chandoo Mondeti : నా సినీ కెరీర్ లో ఇలాంటి అమ్మాయిని చూస్తానని అనుకోలేదన్నాడు తండేల్ చిత్ర దర్శకుడు చందూ మొండేటి(Chandoo Mondeti). గీతా ఆర్ట్స్ సమర్పణలో దీనిని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున మొదలు పెట్టారు. శ్రీమణి రాసిన హైలెస్సో హైలెస్సా సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చార్ట్స్ లో టాప్ లో కొనసాగుతోంది. ఇక రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది ఈ పాటకు ప్రాణం పోసిన నటి సాయి పల్లవి.
Chandoo Mondeti Shocking Comments
ఈ సందర్బంగా దర్శకుడు చందు మొండేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తన గురించి. తను వెరీ వెరీ స్పెషల్. ఎంతలా అంటే. మనం సీన్ గురించి చెప్పేస్తే చాలు. తను వంద రకాలుగా ఆలోచిస్తుంది. ఎన్ని టేకులైనా సరే బాగా వచ్చేంత వరకు కష్ట పడుతూనే ఉంటుందన్నాడు. తాను ఇదివరకు చేసిన సినిమాల కంటే ఈ మూవీ భిన్నమని పేర్కొన్నాడు చందూ మొండేటి.
నాకు ఏం కావాలనేది తనే ముందు గ్రహించింది. సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తను నటి మాత్రమే కాదు బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ అంటూ కితాబు ఇచ్చాడు. తన నుంచి నేను చాలా నేర్చుకున్నానని , వామ్మో ఆమెతో చేయడం కష్టమంటూ పేర్కొన్నాడు డైరెక్టర్.
Also Read : Director Maruthi Success :ఫెయిల్యూర్ నాకు కిక్ ఇస్తుంది
