బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను సంచలనంగా మారారు. తను కెరీర్ పరంగా కేవలం ఆకట్టుకునే, ఆలోచింప చేసే పాత్రలనే ఎంచుకుంటోంది. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. తాను తాజాగా వైరల్ గా మారింది. ఎందుకంటే భారీ ధరకు అత్యంత విలాసవంతమైన ఉండేందుకు తనకు నచ్చిన అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసింది. ఏకంగా ఇందు కోసం రూ. 4.33 కోట్లు ఖర్చు చేసింది. ట్యాక్స్ కాకుండా.
ఇది ముంబైలోని అత్యంత డిమాండ్ కలిగిన ఏరియా. గోరేగావ్ వెస్ట్ లో దీనిని కొనుగోలు చేసింది. అప్ స్కేల్ ఇంపీరియల్ హైట్స్ దీనిని నిర్మించింది. ఇందులో ఫ్లాట్ ను కలిగి ఉండడం సోషల్ స్టేటస్ గా భావిస్తారు నటీ నటులు. ఇక దీని వివరాల లోకి వెళితే ఆస్తి రిజిస్ట్రేషన్ ఫలితాల ప్రకారం 1,390 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. 1,669 చదరపు అడుగుల బిల్డ్ అప్ ఏరియాతో పాటు 2 ప్రత్యేకంగా కార్ పార్కింగ్ స్థలాలను కూడా కలిగి ఉండడం విశేషం.
ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంచనాల ప్రకారం తాప్సీ పన్ను రూ. 21 లక్షల 65 వేల రూపాయలను స్టాంప్ డ్యూటీ కింద చెల్లించారు. దీంతో కలుపుకుంటే మొత్తం అపార్ట్మెంట్ ధర రూ. 4 కోట్ల 51 లక్షల 33 వేలు అన్నమాట. ప్రస్తుతం తాప్సీ పన్ను ఫుల్ బిజీగా ఉంది. సినిమాలలో కీలక రోల్స్ పోషిస్తూ లైఫ్ ను, కెరీర్ ను ఎంజాయ్ చేస్తోంది.