గుజరాత్ – యంగ్ సెన్సేషన్ బీహార్ కు చెందిన 14 ఏళ్లు నిండని నూనుగు మీసాల కుర్రాడు ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 18వ సీజన్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అద్బుతమైన షాట్స్ తో ఆకట్టుకున్నాడు. అంతే కాదు టాప్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అతి పిన్న వయసులో గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించాడు. ఏకంగా సెంచరీతో విరుచుకు పడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున తను ప్రాతినిధ్యం వహించాడు. టోర్నీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు.
ఈ సందర్బంగా తనకు టాటా కాస్ట్ లీ కారు వరించింది. టోర్నీ ముగిసింది. ఆర్సీబీ విశ్వ విజేతగా నిలిచింది. ఆ జట్టు పంజాబ్ ను 6 రన్స్ తేడాతో ఓడించింది. పలు అవార్డులను ప్రకటించింది ఐపీఎల్ గవర్నింగ్ బాడీ. ఇందులో భాగంగా ఆరెంజ్ క్యాప్ తో పాటు ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా సాయి సుదర్శన్ కు దక్కింది. తనకు రూ. 10 లక్షలు వచ్చాయి. వైభవ్ సూర్య వంశీకి సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్ కింద టాటా కర్వ్ కారు లభించింది.
నికోలస్ పూరన్ కు సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ కు ఎంపికయ్యాడు. రూ10 లక్షలు దక్కాయి. ది గో ఫోర్స్ ఆఫ్ ది సీజన్ అవార్డు సాయి సుదర్శన్ కు దక్కింది. రూ. 10 లక్షలు క్యాష్ ప్రైజ్ లభించింది. సిరాజ్ గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్ అవార్డు దక్కింది. రూ. 10 లక్షలు రివార్డు వరించింది. కమింద్ మెండీస్ కు క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. తనకు రూ. 10 లక్షలు వచ్చాయి. ఫెయిర్ ప్లే అవార్డు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దక్కింది. రూ. 10 లక్షలు లభించాయి. ఇక ముంబై ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డుకు ఎంపికయ్యాడు. తనకు రూ. 15 లక్షల బహుమతి లభించింది.
