Anupam Kher: ముంబైలోని వీర దేశాయ్ ప్రాంతంలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. అనుపమ్ ఖేర్ ఆఫీస్ లో రెండు తలుపులు పగులగొట్టి ప్రవేశించిన దోపిడీ దొంగలు డబ్బు దోచేయడమే గాక ఫిలిం నెగెటివ్ కూడా ఎత్తుకెళ్లారట. ఈ నేపథ్యంలో దొంగిలించిన వస్తువుల వివరాలను అనుపమ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు.
Anupam Kher….
అనుపమ్ ఖేర్ తన కార్యాలయంలో జరిగిన దోపిడీ వివరాలను వెల్లడించారు. అతడి పోస్ట్ ప్రకారం… ఇద్దరు దొంగలు రెండు తలుపులు పగులగొట్టి ప్రవేశించారు. ఖేర్ కంపెనీ నిర్మించిన సినిమాకి సంబంధించిన నెగెటివ్‌తో కూడిన బాక్స్‌ను… అలాగే ఖాతాల విభాగంలోని మొత్తం సేఫ్ లాకర్‌ను వారు దొంగిలించారు. అనుపమ్ ఖేర్(Anupam Kher) తన పోస్ట్‌లో దొంగలు సేఫ్ లాకర్‌ను బ్రేక్ చేయలేరని కూడా పేర్కొన్నాడు. అనుపమ్ ఖేర్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చోరీకి గురైన వస్తువులతో ఆటో రిక్షాలో ఆఫీసు నుంచి బయలుదేరిన దొంగలు సీసీటీవీ ఫుటేజీలో చిక్కుకున్నారని ఖేర్ పేర్కొన్నారు. త్వరితగతిన విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇన్‌స్టాలో అనుపమ్ ఖేర్ పోస్ట్ లకు అభిమానుల నుండి ఆందోళన వ్యక్తమైంది. చోరీకి గురైన వస్తువులు త్వరగా రికవరీ అవుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. అనుపమ్ నటించిన చివరి చిత్రం ఛోటా భీమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యాన్.
Also Read : Chandrika Gera Dixit: బిగ్ బాస్ లో అడుపెడుతున్న బ్యూటీఫుల్ ఫుడ్ వ్లాగర్ !