Thudarum : మలయాళ సినీ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీ రోల్ పోషించిన చిత్రం తుడారుమ్. విడుదలైన నాటి నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కాసుల వర్షం కురిపిస్తోంది ఈ మూవీ. ఏకంగా ఇప్పటి వరకు రూ. 65 కోట్ల మార్క్ ను దాటేసింది. సినీ వర్గాలను విస్మయ పరిచేలా చేసింది. ఇక స్టార్ హీరోతో తీసిన మరో మూవీ ఎల్ 2 కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ఏడాది మోహన్ లాల్ కు మంచి ఆరంభం లభించిందని చెప్పక తప్పదు. తను తమిళంలో లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ తో తీస్తున్న కూలీలో కీ రోల్ పోషిస్తున్నాడు.
Hero Mohanlal Thudarum Movie Updates
ఇదే సమయంలో మంచు మోహన్ బాబు సమర్పించిన కన్నప్పలో కూడా ముఖ్య పాత్ర లో కనిపించనున్నాడు. ఎక్కడా తను టైం వేస్ట్ చేయడం లేదు. బహు భాషలలో నటిస్తూ బిజీగా మారి పోయాడు మోహన్ లాల్. తను గతంలో రామ్ గోపాల్ వర్మ కంపెనీలో నటించాడు. ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన జనతా గ్యారేజ్ లో ఉగ్ర రూపం చూపించాడు. నటనా పరంగా వంద మార్కులు పడ్డాయి. మలయాళ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రేక్షకుల ఆలోచనలకు తగినట్టుగా సామాజిక బాధ్యతతో తీస్తున్నారు అక్కడి మూవీ మేకర్స్. అందులో భాగంగా వచ్చిందే తుడారుమ్.
చాన్నాళ్ల తర్వాత తుడారుమ్(Thudarum) లో నటించింది నటి శోభన. గతంలో కూడా మోహన్ లాల్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది తను. వారాంతంలో సినిమా కలెక్షన్స్ రికార్డ్ ల మోత మోగిస్తోంది. దీంతో ఫుల్ ఖుష్ లో ఉన్నారు నటీ నటులు. ఎల్ 2 ఎంపురాన్ విడుదలైన ఒక నెల వ్యవధిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడు రోజుల్లోనే రూ. 24.74 కోట్ల నికర వసూళ్లను సాధించింది. అంతర్జాతీయ పరంగా చూస్తే రూ. 38.98 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది 2025లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో చిత్రంగా తుడారుమ్ నిలిచింది. రాబోయే రోజుల్లో రూ. 100 కోట్లు సాధిస్తుందని అంచనా.
Also Read : Hero Vishnu Kannappa : మే 8 నుంచి యుఎస్ లో కన్నప్ప ప్రమోషన్స్
