Kamal Haasan : దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా థగ్ లైఫ్. స్టార్ హీరో కమల్ హాసన్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. అంతే కాదు తను ఓ పాటను కూడా రాశారు. ఇప్పుడు ఆ సాంగ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తనలో నటుడే కాదు దర్శకుడు, భావుకుడు, కవి, రచయిత కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఇందులో గ్యాంగ్ స్టర్ గా శింబు నటిస్తుండడం విశేసం. తను కీలక పాత్ర పోషిస్తున్నాడు. తనతో పాటు కమల్ హాసన్(Kamal Haasan) కూడా మరో పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారు.
Kamal Haasan-Thug Life Movie Sensational
ఇక ఎప్పటి లాగే మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ థగ్ లైఫ్(Thug Life) కు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సంవత్సరమే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. మణిరత్నం సినిమా కావడంతో ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత అంటే 36 ఏళ్ల అనంతరం మణిరత్నం, కమల్ హాసన్ తిరిగి కలిసి సినిమా చేయడంతో అంచనాలు మరింత పెంచేలా చేశాయి. వీరిద్దరి చివరి కలయిక బ్లాక్ బస్టర్ చిత్రం నాయకన్. తెలుగులో నాయకుడుగా వచ్చింది. అది ఆనాడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక ఈ థగ్ లైఫ్ భారత దేశంలో చేయి తిరిగిన దొంగలు, హంతకులైన దండగుల గురించి ఉంటుందని సమాచారం. ఈ మూవీ ప్రోమో 2023 నవంబర్ లో రిలీజ్ అయ్యింది. థగ్ లైఫ్ కథను కమల్ హాసన్ స్వయంగా రాశారు. చిత్రంలో త్రిష కృష్ణన్, అభిరామి, నాజర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, గౌతమ్ కార్తీక్, జోజు జార్ఝ్, ఐశ్వర్య లక్ష్మి, తదితరులు కీలక పాత్రలో నటించారు. తాజాగా థగ్ లైఫ్ మూవీకి సంబంధించి జింగుచా పేరుతో కమల్ హాసన్ రాసిన పాటను విడుదల చేశారు. విడుదైలన కొద్ది నిమిషాల్లోనే మిలియన్స్ వ్యూస్ సంపాదించుకుంది.
Also Read : Beauty Pooja Hegde :పూజా హెగ్డే..సూర్య రెట్రో హల్ చల్
