సుదీర్ఘ కాలం తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన చిత్రం థగ్ లైఫ్. దీనిని యాక్షన్ ప్యాక్డ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కించాడు. ఇందులో ఇలయ నాయగన్ తో పాటు సిలాంబరసన్ ముఖ్య పాత్ర పోషించాడు. దీనికి కథ రాశాడు..అంతే కాదు ఓ పాటకు ప్రాణం పోశాడు కమల్ హాసన్. థగ్ లైఫ్ కు విశేషం ఉంది. 12 ఏళ్ల గ్యాప్ తర్వాత అందాల తార త్రిష కృష్ణన్ , శింబు కలిసి నటించడం.
ఈ వేసవి కాలంలో అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఈ మూవీ. మూడు దశాబ్దాలకు పైగా అంతరం తర్వాత మణిరత్నం, కమల్ కలయిక ఇది. ముంబై నేపథ్యంగా సాగిన నాయకుడు సినిమా వచ్చింది. దానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చాడు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చాడు దర్శకుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం, స్వరాలు కూర్చాడు. ఇప్పటికే పాటలు కెవ్వు కేక అనిపించేలా ఉంటున్నాయి.
ఇక థగ్ లైఫ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు దర్శక, నిర్మాతలు. ఆకట్టుకునే సన్నివేశాలు, అంతకు మించిన ఉత్కంఠ భరితమైన సంభాషణలు, పోటా పోటీగా సాగే గ్యాంగ్ స్టర్ ల వార్, అందాల తార తళుక్కుల మధ్య థగ్ లైఫ్ మరింత ఆసక్తిని, ఉత్కంఠను రేపుతోంది. ఇది ముమ్మాటికీ మణిరత్నం నుంచి వస్తున్న మరో సక్సెస్ ఫుల్ మూవీ అని చెప్పక తప్పదు.
