బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక గతంలో వచ్చిన టైగర్ మూవీ రికార్డుల మోత మోగించింది. కలెక్షన్ల వర్షం కురిసింది. తాజాగా టైగర్ చిత్రానికి సంబంధించి సీక్వెల్ గా గతంలో టైగర్ 2 వచ్చింది. అది కూడా రికార్డ్ మోత మోగించింది. ప్రస్తుతం మరో సీక్వెల్ తీశాడు దర్శకుడు . పోరాట సన్నివేశాలతో పాటు ఆకట్టుకునే డైలాగులు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
ఈ చిత్రంలో లవ్లీ గర్ల్ కత్రీనా కైఫ్ కూడా నటిస్తోంది. ఒకరితో మరొకరు పోటీపడ్డారు. తాజాగా మూవీ మేకర్స్ టైగర్ 3 చిత్రానికి సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. లేకే ప్రభు కా నామ్ పేరుతో సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో సల్మాన్ మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు.
తెలుగు ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది ఈ చిత్రం. భారీ అంచనాలు నెలకొన్నాయి . ప్రధాన కథ ఏమిటంటే 20 ఏళ్ల పాటు భారత దేశం కోసం అర్పించిన స్పై ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. అట్లాంటి వ్యక్తిని దేశ ద్రోహి అని ముద్ర వేస్తే ఎలా అన్నదే ఈ చిత్రం .