బాలీవుడ్ లో సూపర్ క్రేజీ ఉన్న హీరో సల్మాన్ ఖాన్. మనోడి నటనకు ఫిదా అయ్యే ఫ్యాన్స్ ఎందరో. తాజాగా మరో దిగ్గజ నటుడు షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ బాక్సులు బద్దలు కొట్టాయి. కోట్ల రూపాయలు కురిపించాయి. తాజాగా షారుక్ తర్వాత సల్మాన్ నటించిన టైగర్ 3 మూవీ రాబోతోంది.
ఇది గతంలో వచ్చిన మూవీకి సీక్వెల్ కావడం విశేషం. టైగర్ బిగ్ సక్సెస్ గా నిలిచింది. దీంతో దర్శక, నిర్మాతలు దీనిపై ఫోకస్ పెట్టారు. అంచనాలకు మించి సినిమాను రూపొందించారు.
ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సినిమాకు సంబంధించి టైగర్ 3 సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. భారీ సన్నివేశాలు, ఉత్కంఠ భరితంగా సాగే పోరాట దృశ్యాలు మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఈ టైగర్ మూవీకి మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. రచన, స్క్రీన్ ప్లే శ్రీధర్ రాఘవన్ సమకూర్చారు. ఇక అంకుర్ చౌదరి మాటలు రాస్తే ఆదిత్యా చోప్రా కథ రాశాడు. ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మించాడు. ఇక టైగర్ 3లో కీలకమైన పాత్రలు పోషించారు సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ , ఇమ్రాన్ హష్మీ.
