టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న నటుడు మాస్ మహరాజా రవితేజ. తను పోలీస్ ఆఫీసర్ గా భలే కుదిరి పోతాడు. శ్రీలీలతో కలిసి తను నటించిన ధమాకా బిగ్ సక్సెస్ గా నిలిచింది. ప్రస్తుతం ఇదే ఊపులో నటించిన టైగర్ నాగేశ్వర్ రావు ఈసారి దసరా బరిలో నిలవనుంది. ఈ చిత్రంతో పాటు తళపతి విజయ్ నటించిన లియో, నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి కూడా పోటీలో ఉన్నాయి.
కానీ తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు రవితేజకు. టైగర్ నాగేశ్వర్ రావు చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ దుమ్ము రేపాయి. ఈ చిత్రానికి వంశీ కృష్ణ నాయుడు దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ విస్సా డైలాగులు రాశాడు. ఇవి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి.
ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన నుపుర్ సనన్ , గాయత్రీ భరద్వాజ్ తో పాటు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా కీలక పాత్రలలో నటించారు.