Racharikam: అప్సరా రాణి ‘రాచరికం’ నుండి టిక్కు టిక్కు సాంగ్ రిలీజ్ !

అప్సరా రాణి ‘రాచరికం’ నుండి టిక్కు టిక్కు సాంగ్ రిలీజ్ !

Hello Telugu - Racharikam

Racharikam: అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా సినిమా ‘రాచరికం’. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్నాయి. ‘రాచరికం(Racharikam)’కు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, ఆ పోస్టర్లలో అప్సరా రాణి కనిపించిన తీరు సినిమాపై భారీగా క్రేజ్ పెంచేయగా.. తాజాగా ఈ సినిమా నుంచి ‘టిక్కు టిక్కు’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Racharikam Movie Updates

ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే… ‘టిక్కు టిక్కు’ అంటూ సాగిన ఈ హుషారైన పాటను ప్రముఖ రచయిత పెంచల్ దాస్ రాశారు. ఈ పాట రాయడమే కాకుండా సింగర్ మంగ్లీతో కలిసి ఆయనే ఆలపించారు. సంగీత దర్శకుడు వెంగి ఇచ్చిన ఈ బాణీ ఎంతో హుషారుగా అనిపిస్తూ, వినగానే కిక్కిచ్చేలా ఉంది. పర్‌ఫెక్ట్ జాతర సాంగ్‌ లా ఎంతో రిచ్‌గా పాటను తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. పోలంకి విజయ్ కొరియోగ్రఫీతో ఈ పాట తెరపై విజువల్ ఫీస్ట్‌గా కనిపించేలా ఉంది.

హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్‌గా, రామ్ ప్రసాద్ డైలాగ్ రైటర్‌గా, చాణక్య ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్‌గా, జేపీ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

Also Read : Aishwarya Lekshmi: సాయి దుర్గ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి ! కన్ఫర్మ్ చేసిన మేకర్స్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com