హైదరాబాద్ – తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. భాయ్, యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం వంటి చిత్రాలకు పేరుగాంచిన ప్రముఖ తెలుగు దర్శకుడు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి నిన్న రాత్రి కన్నుమూశారు. దర్శకుడు తీవ్ర అనారోగ్యంతో బాధప డుతున్నారని, గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది.
గోపీచంద్ నటించిన యజ్ఞం చిత్రంతో ఎ.ఎస్. రవికుమార్ టాలీవుడ్‌లో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. తరువాత, స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. బాలకృష్ణతో వీరభద్ర చిత్రాన్ని నిర్మించారు. సాయి దుర్ఘ తేజ్ తొలి విడుదల పిల్లా నువ్వు లేని జీవితం చిత్రానికికూడా ఆయనే దర్శకత్వం వహించారు. సౌఖ్యం, ఆటదిష్ట చిత్రాలు తీశారు.
దర్శకుడు రవి కుమార్ చౌదరికి భార్య, పిల్లలు ఉన్నారు. సినీ వర్గాల సమచారం ప్రకారం తాను చాలా కాలంగా ఒంటరిగా ఉన్నారని వినికిడి. దర్శకుడు చివరి చిత్రం రాజ్ తరుణ్ తో తిరగబడర స్వామి . ఇది ఆశించిన మేర ఆడలేదు. సినిమా రిలీజ్ ఈవెంట్ సందర్బంగా చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
అయితే తను తీసిన చిత్రాలలో కొన్ని సక్సెస్ కాగా మరికొన్ని ప్లాప్ గా నిలిచాయి. ప్రతి మూవీలో సినిమాకు సంబంధించిన పాటలు మరింత ఆకట్టుకునేలా తీయడంలో సక్సెస్ అయ్యారు. మరి వినసొంపుగా ఉండేవి. ఏఎస్ రవి కుమార్ చౌదరి ఆకస్మిక మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
