త‌లైవాను క‌లిసిన ద‌ర్శ‌కుడు అభిన‌వ్ జీవింత్

ఇన్నేళ్ల‌కు నా క‌ల సాకార‌మైంద‌ని కామెంట్స్

సినీ రంగానికి సంబంధించి ల‌క్ కంటే క‌ష్టం ఒక్కోసారి తెర పైకి తీసుకు వ‌చ్చేలా చేస్తుంది. ల‌క్ష‌లాది మంది నిత్యం క‌ల‌లు కంటారు. త‌మ‌ను తాము ఊహించుకుంటారు. క‌ళ్లు చెదిరే కాసులు, అంత‌కు మించిన అభిమానులు. ఎక్క‌డికి వెళ్లినా త‌ర‌గ‌ని స్టార్ ఇమేజ్. కానీ ఒక్కోసారి స‌క్సెస్ ఉన్నంత వ‌ర‌కే. ఇది రాజ‌కీయ‌, సినిమా, క్రీడా రంగాల‌కు ఎక్కువ‌గా వ‌ర్తిస్తుంది. ఎందుకంటే ఈ రంగాలే ఇప్పుడు దేశాన్ని ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తున్నాయి. ఇక అభిన‌వ్ జీవింత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి.

త‌ను ముందు నుంచి సినిమా రంగంలో ముద్ర వేయాల‌ని అనుకున్నాడు. చాలా క‌ష్టాలు ప‌డ్డాడు. చివ‌ర‌కు అనుకున్న‌ది సాధించాడు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో క‌థ‌ను ఎంచుకున్నాడు. అద్భుతంగా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు తెర మీద చూపించాడు. అదే టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ. ఇది ఊహించ‌ని స‌క్సెస్ అందుకుంది. సినీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. భారీ ఎత్తున జ‌నం ఆద‌రిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. అయితే ప్ర‌సంస‌ల జ‌ల్లుల్లో మునిగి పోయిన ద‌ర్శ‌కుడు అభిన‌వ్ జీవింత్ త‌న మ‌నసులోని మాట‌ను పంచుకున్నాడు. అది ఫోటో రూపంలో.

సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా ఎన్నాళ్లో వేచిన ఉద‌యం ఈనాడే ఎదురైంద‌న్నాడు. త‌న జీవితంలో ఒక్క‌సారైనా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ను క‌లుసు కోవాల‌ని ఉండేద‌ని, ఈ సినిమా స‌క్సెస్ తో తన‌కు ఆ అవ‌కాశం తీరి పోయింద‌న్నాడు. ఇదంతా సినిమానే క‌లిపింద‌ని పేర్కొన్నాడు. హ్యాట్సాఫ్ యూ ..యంగ్ డైరెక్ట‌ర్ కు మంచి భ‌విష్య‌త్తు ఉంది. ఉండాలి కూడా.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com