Hero Vijay Deverakonda :హీరో అయితే నోరు పారేసుకుంటే ఎలా..?

గిరిజ‌నులంటే ఎందుకంత చుల‌క‌న

Hero Vijay Deverakonda

Vijay Deverakonda : ఈ దేశంలో అంద‌రికీ బ‌తికే, ప్ర‌శ్నించే హ‌క్కు ఉంటుంది. ఇది భార‌త రాజ్యాంగం క‌ల్పించింది. ఇక సినిమా రంగానికి చెందిన హీరో, హీరోయిన్లు, ఇత‌ర సాంకేతిక నిపుణులు తాము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంద‌ని అనుకుంటారు. అంతే కాదు తాము అతీత‌మ‌ని, దైవాంస సంభూతుల‌మ‌ని భావిస్తారు. కానీ అంద‌రినీ ఒకే గాట‌న క‌ట్ట‌లేం. కానీ కొంద‌రు మాత్రం ప‌నిగ‌ట్టుకుని గొప్ప‌గా ఫీల్ అవుతూ ఇత‌రుల‌ను, కొన్ని సామాజిక వ‌ర్గాల‌ను కావాల‌ని ల‌క్ష్యంగా చేసుకుని చుల‌క‌న చేసి మాట్లాడ‌టం చేస్తూ వ‌స్తున్నారు. ఆ త‌ర్వాత సారీ చెప్ప‌డం ప‌రిపాటిగా మారింది.

Vijay Deverakonda Comments Sensational

ప్ర‌స్తుతం రౌడీగా ముద్ర ప‌డి, అభిమానులు సంపాదించుకున్న యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ(Vijay Deverakonda) నోరు జారాడు. ట్రైబ‌ల్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆదివాసీల గురించి తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హీరోపై కేసు న‌మోదు చేయాల‌ని కోరారు ఓ లాయ‌ర్. ఈ సంఘ‌ట‌నకు వేదికైంది కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సూర్య‌, పూజా హెగ్డే కీల‌క పాత్ర‌లు పోషించిన రెట్రో ఈవెంట్ సంద‌ర్బంగా.

సినిమా గురించి మాట్లాడాల్సింది పోయి..ఆదివాసీలపై మ‌నోడు నోరు పారేసుకున్నాడు. పాకిస్తాన్ ను ఉద్దేశించి 500 ఏళ్ల కింద‌ట ట్రైబ‌ల్స్ లాగా కొట్టుకోవ‌డం ఏంటి అంటూ మండిప‌డ్డారు. దీంతో గిరిజ‌నులు భ‌గ్గుమ‌న్నారు. త‌నను అరెస్ట్ చేయాలంటూ కోరుతున్నారు. స‌మ‌స్య తీవ్ర‌త పెర‌గ‌డంతో గ‌త్యంత‌రం లేక విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌న‌సు మార్చుకున్నాడు. త‌ప్పైంది మ‌న్నించ‌మ‌ని కోరాడు. మొత్తంగా హీరో త‌ను కూడా మామూలు మ‌నిషి అని గుర్తించాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Also Read : Natural Star Nani-Paradise : నాని ప్యార‌డైజ్ మూవీకి భారీ డిమాండ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com