బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఒకే ఒక్కడి పేరు వినిపిస్తోంది అతడు ఎవరో కాదు విలక్షణ దర్శకుడు తెలుగువాడైన వంగా సందీప్ రెడ్డి. తను తీసింది కొన్ని చిత్రాలే. అన్నీ బ్లాక్ బస్టరే. గత ఏడాది రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నాతో కలిసి తీసిన యానిమల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో వంగా సందీప్ రెడ్డి ఎలాంటి మూవీ, ఎవరితో తీయ బోతున్నాడనే చర్చలకు, ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశాడు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో తాను మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు అధికారికంగా సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఆ మూవీనే స్పిరిట్. ఇప్పటికే కథ ఫైనల్ అయ్యిందని, ప్రభాస్ కూడా ఓకే చెప్పాడని వెల్లడించాడు వంగా సందీప్ రెడ్డి. ఇదే సమయంలో ఎవరు హీరోయిన్ గా తీసుకోవాలనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ముందుగా దీపికా పదుకొనేను అనుకున్నారు. కానీ తను ఏకంగా సినిమా లో నటించేందుకు గాను రూ. 20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ కోరిందని, దీంతో వంగా నీతో సినిమా తీయనంటూ బిగ్ షాక్ ఇచ్చాడు.
తను తీసిన యానిమల్ చిత్రంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది త్రిప్తి దిమ్రీ. ఈ మేరకు వంగా తన స్పిరిట్ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తుందని అధికారికంగా ప్రకటించాడు. ఇందులో నటిస్తున్నందుకు గాను తనకు రూ. 4 కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీపికా, వంగా మధ్య కేవలం పారితోషకం విషయంలోనే గ్యాప్ వచ్చిందని, అందుకే తనను తప్పించినట్లు టాక్.
