Beauty Trisha-Chiranjeevi :మెగాస్టార్ స‌ర‌స‌న ముద్దుల‌గుమ్మ

సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి 23 ఏళ్లు

Trisha : ఏజ్ పెరిగినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు సూప‌ర్ స్టార్స్. సినీ రంగానికి చెందిన హీరోల‌లో ముందుగా చెప్పాల్సింది త‌మిళ సినీ రంగానికి చెందిన త‌లైవా ర‌జ‌నీకాంత్. బాలీవుడ్ కు చెందిన బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్. మాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో మోహ‌న్ లాల్. శాండిల్ వుడ్ కు చెందిన శివ రాజ్ కుమార్. టాలీవుడ్ కు చెందిన మెగాస్టార్ చిరంజీవి. ఇక హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే జ‌య‌సుధ‌, హేమ మాలిని, మాధురి దీక్షిత్, ర‌వీనా టాండ‌న్ , త్రిష కృష్ణ‌న్(Trisha)..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది త‌మ అద్భుత‌మైన సౌంద‌ర్యంతో ఆక‌ట్టుకుంటున్నారు. అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Trisha New Movie With Megastar Chiranjeevi

తాజాగా యంగ్ హీరోస్ టాప్ లో దూసుకు పోతుండ‌గా వారితో తామేమీ త‌క్కువ కాదంటూ దుమ్ము రేపుతున్నారు. ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సూప‌ర్ హిట్ కాగా ప్ర‌స్తుతం కూలీతో ముందుకు వ‌స్తున్నాడు. ఇక చిరంజీవి విష‌యానికి వ‌స్తే మైథ‌లాజిక‌ల్ మూవీ తెర‌కెక్కుతోంది విశ్వంభ‌ర. ఇప్ప‌టికే పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు అద్భుత‌మైన ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో మూవీ మేక‌ర్స్ తెగ ముచ్చ‌ట ప‌డుతున్నారు. మెగా ఫ్యాన్స్ తెగ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా విశ్వంభ‌ర గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఇందులో అవ‌ని పాత్ర‌లో త్రిష కృష్ణ‌న్ న‌టించ‌నుంది. త‌ను స్టార్ హీరోలంద‌రితో న‌టిస్తూ దుమ్ము రేపుతోంది. సూర్య‌, అజిత్ , ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీస్ ల‌లో ముఖ్య భూమిక పోషించింది. ఇదిలా ఉండ‌గా విశ్వంభ‌ర మూవీ మేక‌ర్స్ అనౌన్స్ చేసింది. మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంగా త‌ను సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి 23 ఏళ్ల‌వుతోంది. ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంటోంది. త‌న ఏజ్ పెరిగినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

Also Read : Panch Minar Song Sensational :జాను మేరీ జాను నువ్వే నా పాంచ్ మినార్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com