TTD Chairman-Br Naidu Shocking :టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆక‌స్మిక త‌నిఖీ

వెంగమాంబ అన్న ప్ర‌సాదం..ల‌డ్డూ కౌంట‌ర్లు

TTD Chairman-Br Naidu Shocking

TTD Chairman : తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు(TTD Chairman) దూకుడు పెంచారు. పుణ్య క్షేత్రంలో భ‌క్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాల క‌ల్ప‌న గురించి ఆరా తీశారు. ఆయ‌న కొలువు తీరాక త‌నిఖీలు ముమ్మరం చేశారు. సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా వేలాది మందికి నిత్యం ఆక‌లిని తీరుస్తున్న శ్రీ త‌రిగొండ వెంగమాంబ అన్న ప్ర‌సాదాల‌ను, ల‌డ్డూ కౌంట‌ర్ల‌ను ఆకస్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్బంగా సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చిన భ‌క్తుల‌తో కాసేపు ముచ్చ‌టించారు. అన్న ప్ర‌సాదం ఎలా ఉందంటూ అడిగారు. గ‌తంలో కంటే మరింత మెరుగైన‌, నాణ్య‌త‌తో, రుచిక‌రంగా ఉందంటూ స‌మాధానం ఇచ్చారు. దీంతో సంతృప్తిని వ్య‌క్తం చేశారు టీటీడీ చైర్మ‌న్.

TTD Chairman Br Naidu Shocking

అంత‌కు ముందు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాలు భవనాన్ని తనిఖీ చేశారు. వంటల తయారీ, వంట సామాగ్రి నిల్వలు, శుభ్రతను పరిశీలించారు.అనంతరం భక్తులతో ఆయన ముచ్చటించి వారికి వడ్డిస్తున్న అన్న ప్రసాదం నాణ్యతపై భక్తులు నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అన్నప్రసాదం నాణ్యత మెరుగు పడటం పట్ల భక్తులు అపారమైన సంతృప్తిని వ్యక్తం చేశారు. లడ్డూ కౌంటర్లను తనిఖీ చేసి క్యూ లైన్లను, లడ్డూల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. లడ్డూల నాణ్యత, పరిమాణం, రుచిపై భక్తుల నుండి అభిప్రాయాలను కనుక్కొన్నారు. లడ్డూ ప్రసాదాల నాణ్యత మెరుగుపడటం పట్ల భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read : TTD Chairman Improved :స్విమ్స్ లో మరింత ఉన్నతంగా వైద్య సేవలు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com