TTD Chairman Improved :స్విమ్స్ లో మరింత ఉన్నతంగా వైద్య సేవలు

టిటిడి ఛైర్మెన్ శ్రీ బీ ఆర్ నాయుడు ప్ర‌క‌ట‌న

TTD Chairman Improved

TTD Chairman : తిరుపతి – తిరుపతి స్విమ్స్ లో మరింత ఉన్నతంగా వైద్య సేవలు అందిస్తామని టిటిడి చైర్మెన్(TTD Chairman) బీ ఆర్ నాయుడు తెలిపారు. మెరుగైన‌ సేవలు అందించేందుకు గత మూడు నెలల నుండి మాజీ టిటిడి ఈవో ఐవి సుబ్బరావు అధ్యక్షతన వేసిన ప్రత్యేక ఎక్స్ ఫర్ట్ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించిందన్నారు. ఈ నివేదికలో మౌళిక సదుపాయాలు, మానవ వనరులు, వైద్య పరికరాలు, ఇంజనీరింగ్ పనులు, మరింత ఉన్నతంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య నిపుణుల సేవలు, నిధుల సేకరణ తదితర అంశాలపై నివేదిక సమర్పించిందన్నారు. ఎక్స్ ఫర్ట్ కమిటీ నివేదికపై టిటిడి బోర్డులో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.

TTD Chairman Improved

టిటిడి ఈవో జె. శ్యామల రావు మాట్లాడుతూ స్విమ్స్ చాలా ప్రతిష్టాకమైనదని, 2021లో టిటిడిలోకి స్విమ్స్ ను అప్పగించారని, స్విమ్స్ కి టిటిడి(TTD) నుండి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని, సంవత్సరానికి రూ. 60 కోట్ల గ్రాంట్ తో పాటు ఎంప్లాయ్ హెల్క్ స్కీం, ప్రాణదాన ట్రస్ట్ , వివిధ రకాల ట్రస్ట్ ల ద్వారా సుమారు రూ. 100 కోట్లుకు పైగా సపోర్ట్ చేస్తున్నామని అన్నారు. స్విమ్స్ అనేది పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్థాపించబడిందని, సంవత్సరానికి 18,000 శ‌స్త్ర చికిత్స‌లు, దాదాపు 4. 50 లక్షలుకు పైగా ఔట్ పేషెంట్లు, 47 వేల ఇన్ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారని, ఇందులో పేదలే అత్యధికంగా ఉన్నారని తెలిపారు.

స్విమ్స్ లో భవిష్యత్ తరాలకు సరిపడేలా ప్లాన్ ప్రకారం నూతన భవనాల నిర్మాణాలు జరుగు తున్నాయని, అంకాలజీ , చిన్న పిల్లల హెల్త్ కోసం నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. అంకాలజీని లెవన్ వన్ సెక్టార్ గా తీసుకెళ్లేందుకు , స్విమ్స్ లో ఫ్యాకల్టీ సమస్య, మానవ వనరులు, మౌళిక సదుపాయాల కల్పన, నిర్మాణాలు, నిధుల సమీకరణ, స్వచ్ఛంగా వచ్చే నిపుణులైన వైద్యుల సేవలు తదితర అంశాలు, సమస్యల పరిష్కారం కేసం ఎక్స్ ఫర్ట్ కమిటీ వేశారని, ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై జనరల్ కౌన్సిల్ చర్చించామన్నారు.

Also Read : Sr NTR Memorable :చిర‌స్మ‌ర‌ణీయుడు తార‌కరాముడు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com