హైదరాబాద్ – తెలంగాణలో సంచలనం సృష్టించింది ప్రముఖ టీవీ జర్నలిస్ట్ , టీ న్యూస్ ఛానల్ స్పెషల్ కరెస్పాండెంట్ స్వేచ్ఛ సూసైడ్ కేసు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధాని పూర్ణ చందర్ రావు అని మృతురాలి పేరెంట్స్ తెలంగాణ శంకర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయంపై ఈ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులంతా మూకుమ్మడిగా స్వేచ్ఛ పేరెంట్స్ కు మద్దతు పలికారు. స్వేచ్ఛ సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదన్నారు.
తనను కావాలనే మానసికంగా, శారీరకంగా హింసించారని , తను తట్టుకోలేక పోయిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా రాత్రి 11 గంటల సమయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణ చందర్ రావు ఉన్నట్టుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయవాదితో కలిసి హాజరయ్యాడు. పోలీసుల ముందు లొంగి పోయాడు.
దీనిపై స్పందించాడు పూర్ణ చందర్ రావు తరపు న్యాయవాది. విషాద సమయంలో భావోద్వేగాలు వ్యక్తం కావడం సహజమేనని పేర్కొన్నారు. ఆ అభిప్రాయాలు కేసును డిసైడ్ చేయలేవని చెప్పారు. స్వేచ్ఛ కూతురు మొదటి రోజు, మూడవ రోజు మాట్లాడిన అంశాల్లో తేడాలు గమనించాలన్నారు. పూర్ణ తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నాడని, లేఖ లో పేర్కొన్న అంశాలే వాస్తవాలని అందులో ఎలాంటి మార్పు లేదని అంటున్నాడని స్పష్టం చేశారు. రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు తనకు తెలిసిందన్నారు.
