ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ కోసం శ్రీ‌లీల సిద్దం

ద‌ర్శ‌కుడు హరీశ్ శంక‌ర్ ఫుల్ ఫోక‌స్

అందాల ముద్దుగుమ్మ శ్రీ‌లీల సంచ‌ల‌నంగా మారింది. త‌ను న‌టించిన చిత్రం రాబిన్ హుడ్ ఆశించిన మేర ఆడ‌లేదు. కానీ బ‌న్నీతో క‌లిసి చేసిన పుష్ప స్పెష‌ల్ సాంగ్ కిస్స‌క్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఆ మూవీ రికార్డ్ స్థాయిలో ఆడింది. ఏకంగా రూ. 1867 కోట్లు వ‌సూలు చేసింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన చిత్రం అంత‌గా ఆడ‌క పోవ‌డంతో కొంత నిరాశ‌కు లోనైంది. ప్ర‌స్తుతం త‌ను హిందీలో ఆషికి -3లో న‌టిస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్య‌న్ హీరో. ఇది పూర్తిగా రొమాంటిక్ స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సినిమాలు అంతగా లేని స‌మ‌యంలో గ‌బ్బ‌ర్ సింగ్ తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇందులో ప‌వ‌ర్ స్టార్ లోని న‌టుడిని ప్ర‌త్యేకంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది ఇందులోని డైలాగులు. ఇప్ప‌టికీ పేలుతున్నాయి. చాలా చోట్ల వాడుతున్నారు కూడా. నాకో తిక్కుంది దానికో లెక్కుంది అన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌లు బుల్లెట్స్ లాగా పేలాయి.

ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కొంత కాలంగా గ్యాప్ వ‌చ్చింది. కానీ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఇందులో కీ రోల్ పోషిస్తోంది ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న శ్రీలీల‌. ఈ నెల‌లోనే సెట్స్ పైకి రానుంద‌ని టాక్. ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసుకోవ‌డంపై ఫోక‌స్ పెట్టాడు. త‌న కెరీర్ లోనే ఇది బిగ్ హిట్ కావ‌డం ఖాయ‌మ‌ని భావిస్తోంది శ్రీ‌లీల‌. ఏ డేట్ అయినా ఓకే చెప్పిన‌ట్లు పెద్ద‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com