Uyyalo Uyyala Song : ఊపేస్తున్న ఉయ్యాలో ఉయ్యాలా

బాల‌య్య భ‌గ‌వంత్ కేసీరి సాంగ్

టాలీవుడ్ లో మోస్ట్ పాపుల‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ హాట్ టాపిక్ గా మారారు. టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరు పొందారు అనిల్ రావిపూడి. బాల‌య్య‌, అనిల్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న భ‌గవంత్ కేస‌రి మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ , సాంగ్స్ భారీ ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొంటున్నాయి. తొలి సాంగ్ సూపర్ హిట్ టాక్ నిలిచింది. దానికంటే ఎక్కువ‌గా తాజాగా రిలీజ్ చేసిన ఉయ్యాలో ఉయ్యాలా పాట దుమ్ము రేపుతోంది.

ఒక ర‌కంగా చెప్పాలంటే నెట్టింట్లో షేక్ చేస్తోంది. ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. ఉయ్యాలో ఉయ్యాలా పాట‌ను అనంత్ శ్రీ‌రామ్ రాశారు. చాలా గ్యాప్ త‌ర్వాత దివంగ‌త ఎస్పీబీ త‌న‌యుడు ఎస్పీ చ‌ర‌ణ్ ఈ సాంగ్ ను మ‌న‌సు పెట్టి పాడారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ భ‌గ‌వంత్ కేస‌రి చిత్రానికి అందించారు. శ్రీ‌లీల‌, నంద‌మూరి బాల‌య్య బాబుపై ఉయ్యాలో ఉయ్యాలా పాట‌ను అద్భుతంగా, హృద‌యానికి ద‌గ్గ‌ర‌య్యేలా తీయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావి పూడి.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com