వంగా సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీ గురించి రోజుకో అప్ డేట్ వస్తోంది. తను తీసింది కేవలం మూడు సినిమాలు మాత్రమే. ఇప్పుడు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ , జనాదరణ కలిగిన ఏకైక దర్శకుడు. భారీ రెమ్యూనరేషన్ తో పాటు టేకింగ్, మేకింగ్ లో తనదైన స్టైల్ తో దూసుకు పోతున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు కథ చెప్పడం, తను ఓకే అనడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వంగా సందీప్ రెడ్డి ఏకంగా స్పిరిట్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. అది సినీ రంగాన్ని షేక్ చేసింది. ఇప్పటికే తను తెలుగులో విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత హిందీలో షాహిద్ కపూర్ తో తీస్తే అది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇదే సమయంలో స్ట్రెయిట్ గా బాలీవుడ్ లో స్టార్ హీరో రణ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో కలిసి యానిమల్ తీశాడు.
ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. కపూర్ సినీ కెరీర్ లో ఏకంగా రూ. 1000 కోట్లు సాధించిన చిత్రంగా నిలిచి పోయింది. ఇందులో తను తీసుకు వచ్చిన బాబీ డియోల్ కు మరిచి పోలేని ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఒక్క మూవీతో తన స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. వరుస సినిమాలతో నటిస్తున్నాడు. తను వంగాను మరిచి పోలేనంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.
ఇదే సమయంలో వంగా స్పిరిట్ ను ప్రకటించడం, హీరోయిన్ల ఎంపికపై ఫోకస్ పెట్టడం జరిగింది. రోజుకో అప్ డేట్ వస్తోంది. గతంలో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న నటి దీపికా పదుకొనే నటిస్తుందని అనుకున్నారు. కానీ ఆమె బన్నీతో జత కడుతోందని, దీంతో తమిళ సినీ నటి రుక్మిణి వసంత్ ను ఎంపిక చేసినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. అయితే తన ఎంపికపై క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు.