Vangalapudi Anitha : అమరావతి – రోజు రోజుకు నేరాలు ఏదో ఒక రూపంలో కొనసాగుతున్నాయని వాటిని నియంత్రించేందుకు పోలీస్ వ్యవస్థ కీలక భూమిక పోషిస్తోందని అన్నారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. బుధవారం కృష్ణ జిల్లా ఉయ్యూరులో రూరల్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూ టెక్నాలజీని అనుసంధానం చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు హొం మంత్రి.
Vangalapudi Anitha Interesting Comments
డ్రోన్లు సహా టెక్నాలజీ ద్వారా నేరాలను నియంత్రిస్తామని చెప్పారు. డ్రోన్ ఎగిరితే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా పోలీస్ నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. ఏపీకీ పోలీస్ అకాడమీ లేదని , త్వరలోనే అప్పా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పోలీస్ స్టేషన్ కొత్త భవన నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన వెంకటస్వామిని అభినందించారు. ప్రతి ఇంట్లో ఓ పోలీస్ మనస్తత్వం ఉండాలన్నారు.
అప్పుడే నేరరహిత సమాజం సాధ్యం అవుతుందన్నారు వంగలపూడి అనిత(Vangalapudi Anitha). లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతే కాకుండా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కోసం భూమని విరాళంగా ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్రను ప్రత్యేకంగా అభినందించారు మంత్రి. జన్మభూమి కాన్సెప్ట్ తో రాష్ట్రంలో పెను మార్పును తీసుకు వచ్చిన ఘనత తమ నాయకుడు, సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.
Also Read : Pradeep Ranganathan-Baiju Look Sensational : ప్రదీప్ రంగనాథన్ బైజు లుక్ కెవ్వు కేక
