Sarangapani Jathakam : “కోర్ట్” చిత్రంతో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం “సారంగపాణి జాతకం(Sarangapani Jathakam)”. “జెంటిల్ మ్యాన్, సమ్మోహనం” చిత్రాల అనంతరం ఇంద్రగంటి మోహనకృష్ణ – శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ శరేవేగంగా సాగుతున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు.
Sarangapani Jathakam Movie Updates
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జెంటిల్మన్, సమ్మోహనం తర్వాత మోహన్ కృష్ణతో మరోసారి సినిమా చేశానని అన్నారు. ఈ సినిమా అవుట్ పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా హిట్ కావడం గ్యారెంటీ. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్, వడ్లమాని శ్రీనివాస్, వీకే నరేష్ ఈ సినిమాకు అస్సెట్. ఓ మంచి ఫ్యామిలీ సినిమాను డెలివరీ చేస్తున్నామని చెప్పారు.
సారంగపాణి జాతకం గురించి చెప్పాలంటే.. నేను స్వతహాగా జాతకాలు నమ్మను.కానీ ఈ సినిమా చేసిన తర్వాత జాతకాలను నమ్మడం మొదలు పెట్టానని అన్నారు. విజయవాడలో డాక్టర్‌గా పని చేసుకొందామంటే.. నన్ను యాక్టర్ చేశారు. సారంగపాణి జీవితంలో ట్విస్టులు ఈ సినిమాలో వినోదాన్ని పండిస్తుంది.ఈ సినిమాతో ప్రియదర్శి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. దర్శకుడు ఇంద్రగంటి బంగారం లాంటి వారు. తెలుగు భాష పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చెప్పలేం. ఆయన సినిమాలో నటించడం గర్వంగా భావిస్తున్నాం అని అన్నారు.
తన జీవితంలో ఒక్క సినిమా అయినా దర్శకుడితో పని చేయాలన్న కోరిక నెరవేరిందన్నారు. మండు వేసవిలో చల్లని ప్రశాంతమైన వాతావరణం కలిగితే ఎంత ఆనందం ఉంటుందో.. ఈ సినిమా కూడా అలాంటి అనుభూతిని కలిగిస్తుందన్నారు. పుష్పక విమానం‘ టాకీ గా వస్తే ఎలా ఉంటుందో , ఈ ‘సారంగపాణి జాతకం‘ అలా ఉంటుందన్నారు కమెడియన్ వెన్నెల కిషోర్.
Also Read : Samantha Shocking :పీరియడ్స్ సహజం ఆందోళన అనవసరం
