Victory Venkatesh : వెంకీ మామ తెగ సంతోషానికి లోనవుతున్నారు. దీనికి కారణం సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తను నటించిన సంక్రాంతికి వస్తున్నాం అద్భుత విజయాన్ని స్వంతం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నటుడు విక్టరీ వెంకటేశ్.
Victory Venkatesh Sankranthiki Vasthunnam Movie Updates
తనతో పాటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంటిల్లిపాదికి వినోదం పంచడంలో సక్సెస్ అయ్యాడు మరోసారి దర్శకుడు రావిపూడి. ప్రారంభం నుంచి ఎండింగ్ దాకా నవ్వులు పూయించాడు. దీంతో సినిమా విడుదలైన రోజు తొలి షో నుంచే వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అంచనాలకు మించి వసూలు చేస్తోంది ఈ చిత్రం. దీంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సందర్బంగా విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh) మీడియాతో మాట్లాడారు. తాము ముందు నుంచీ చెబుతూనే వస్తున్నామని ఈసారి మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని. ఇదే నిజమైందన్నారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడిగా ఇప్పటికే అనిల్ రావిపూడి పేరు తెచ్చుకున్నాడని , తనను తాను ప్రూవ్ చేసుకున్నాడని ప్రశంసలు కురిపించారు. తనది ఇందులో ఏమీ లేదని దీనికి కర్త, కర్మ, క్రియ అంతా అనిల్ రావిపూడిదేనంటూ పేర్కొన్నారు. అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు శతకోటి వందనాలు తెలిపారు.
Also Read : Hero Bunny-Pushpa 2 : మరో కొత్త స్ట్రాటజీతో రానున్న ‘పుష్ప 2’ టీమ్