తమిళ సినీ రంగంలో బిక్షగాడి పాత్రతో సంచలనం సృష్టించిన నటుడు విజయ్ ఆంటోనీ. తను నటుడే కాదు నిర్మత, సంగీత దర్శకుడు, గీత రచయిత, ఎడిటర్ కూడా. సినిమా రంగానికి సంబంధించి విభిన్న రంగాలలో మంచి పట్టుంది మనోడికి. భిన్నమైన పాత్రలను ఎంచుకోవడం తన స్పెషాలిటీ. అందుకే తనకంటూ స్పెషల్ జానర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. తనకంటూ రిజిడ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. తనకు మినిమం గ్యారెంటీ కలిగిన యాక్టర్ గా గుర్తింపు ఉంది.
తాజాగా తను నటించి, స్వయంగా నిర్మించిన చిత్రం మార్గన్. ఈ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహించాడు. దీనిని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ భారీ ఖర్చు పెట్టింది. అంతే కాకుండా సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై జె. రామాంజనేయులు సమర్పిస్తున్నారు. పూర్తిగా దర్శకుడు మిస్టరీ క్రైమ్, థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఇదిలా ఉండగా తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు మూవీ మేకర్స్. ఇందులో ఓ విశేషం కూడా ఉంది. విజయ్ ఆంటోనీ మేనల్లుడు ఇందులో విలన్ గా నటిస్తుండడం.
కాగా ఇటీవలే మార్గన్ మూవీ టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఊహించని బజ్ వచ్చింది. అంచనాలు భారీగా పెరగడంతో మార్కెట్ లో డిమాండ్ వస్తోంది. మంచి కంటెంట్, టేకింగ్ బాగుండడంతో తెలుగులో మార్గన్ రైట్స్ ను స్వంతం చేసుకుంది ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కు చెందిన ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ . ఈ సందర్బంగా నిర్మాతను అభినందించారు నటుడు విజయ్ ఆంటోనీ.
