తమిళ సినీ రంగంలో ప్రత్యేకమైన ఇమేజ్ స్వంతం చేసుకున్న నటుడు విజయ్ ఆంటోనీ. తను నటించిన చిత్రం మార్గన్. తెలుగు వెర్షన్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇది పూర్తిగా నేచురల్ థ్రిల్లర్ గా ఉంది. తను గతంలో బిక్షగాడు మూవీ చేశాడు. ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏదైనా తమిళ సినీ రంగంలో సాంకేతిక నిపుణులకు కొదవే లేదు.
ఇక తాజాగా మార్గన్ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహించాడు. దీనిని విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ నిర్మించింది. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై సమర్పిస్తున్నారు రామాంజనేయులు. చిత్రాన్ని పూర్తిగా దర్శకుడు క్రైమ్, నేచురల్, మిథికల్ , థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ప్రతి సన్నివేశం మరింత ఉత్కంఠను రేపేలా చేశాడు. ఇక తనకు ఇచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు నటుడు విజయ్ ఆంటోనీ.
మార్గన్ మూవీని జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ ను విలన్ గా పరిచయం చేశాడు దర్శకుడు . ఇంకా ఈ చిత్రంలో సముద్ర ఖని, శంకర్, ప్రీతిక, బ్రిగిడ, దీపిక, లక్క పోవతు యారు అర్చన, కనిమొళి, నటరాజన్ నటించారు.
