Vijay Deverakonda : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేశాడు. తను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ రెడ్డి, పరుశురామ్ తీసిన గీత గోవిందం చిత్రంలో నటించాడు. ఈ రెండు మూవీస్ తనను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. ఆ తర్వాత తీసిన మూవీస్ ఆశించిన మేర ఆడలేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ బొక్క బోర్లా పడింది. ఇందులో అనన్య పాండే , ప్రముఖ బాక్సర్ కీ రోల్ పోషించినా సినిమాను గట్టెక్కించ లేక పోయారు.
Vijay Deverakonda Shocking Comments on Bollywood
చిత్రాలు ఆశించిన మేర ఆడక పోయినా ఎక్కడా తన స్టార్ ఇమేజ్ తగ్గలేదు. కాగా ఇంకా పెరిగింది. తన మార్కెట్ వాల్యూ కారణంగా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. చేతినిండా సంపాదిస్తున్నాడు. తాజాగా తాను గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలో కింగ్ డమ్ మూవీ. ఈ సినిమాకు సంబంధించి టీజర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక శ్రీలంకలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సితార ఎంటర్ టైన్మెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. మే 30వ తేదీన వరల్డ్ వైడ్ గా సినిమాను విడుదల చేస్తామన్నారు. చిట్ చాట్ సందర్బంగా తన మనసులో మాట బయట పెట్టాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). దక్షిణాది పరిశ్రమను గతంలో బాలీవుడ్ పట్టించు కోలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు తెలుగు వారు తీసిన మూవీస్ వరల్డ్ వైడ్ గా పేరు పొందుతున్నాయి. ఈ గుర్తింపును తిరిగి తెచ్చుకునేందుకు బాలీవుడ్ ప్రయత్నం చేస్తోదంంటూ పేర్కొన్నారు విజయ్ దేవరకొండ.
Also Read : Hero Akshaye Khanna-Mahakhali :మహాకాళి చిత్రంలో అక్షయ్ ఖన్నా
