తమిళ సినీ రంగానికి సంబంధించి హీరో, హీరోయిన్లలో నెంబర్ వన్ ఎవరు అనే దానిపై సెప్టెంబర్ నెలకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ప్రముఖ భారతీయ మీడియా సంస్థ ఆర్మాక్స్. ప్రతి నెలా కోలీవుడ్ , టాలీవుడ్, శాండిల్ వుడ్ , బాలీవుడ్ కు సంబంధించి టాప్ 10లో ఎవరు ఉన్నారనే దానిపై ప్రకటన చేస్తుంది.
తాజాగా విడుదల చేసిన జాబితాలో హీరోలో తళపతి విజయ్ నెంబర్ 1గా నిలిస్తే హీరోయిన్లలో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిన నయన తార నిలిచింది. ఇక జాబితాల పరంగా చూస్తే ఇలా ఉన్నాయి. ఇక జైలర్ తో దుమ్ము రేపిన రజనీకాంత్ 4వ స్థానంలో నిలిచాడు.
టాప్ లో విజయ్ , అజిత్ కుమార్, సూర్య, రజనీకాంత్ , ధనుష్ నిలిచారు. ఇక 6వ స్థానంలో కమల్ హాసన్ , 7వ స్థానంలో విక్రమ్, 8వ స్థానంలో విజయ్ సేతుపతి, 9వ స్థానంలో శివ కార్తికేయన్ , 10వ స్థానంలో కార్తీ నిలిచారు.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే నయన్ టాప్ లో ఉండగా తర్వాతి స్థానాలలో టాలీవుడ్ లో నెంబర్ 1గా నిలిచిన సమంత రుత్ ప్రభు తమిళంలో 2వ స్థానంలో నిలవడం విశేషం. 3వ స్థానంలో త్రిష, 4వ స్థానంలో
తమన్నా భాటియా, 5వ స్థానంలో కీర్తి సురేష్ , 6వ ప్లేస్ లో సాయి పల్లవి, 7వ స్థానంలో జ్యోతిక, 8వ స్థానంలో ప్రియాంక మోహన్ , 9వ స్థానంలో శ్రుతీ హాసన్ , 10వ స్థానంలో అనుష్క శెట్టి నిలిచారు.
