Vijayashanthi Shocking Comments :త‌ప్పుడు ప్ర‌చారం రాములమ్మ ఆగ్ర‌హం 

అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి మూవీ స‌క్సెస్ 

Vijayashanthi : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన తొలి రోజు పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. త‌ల్లీకొడుకుల మ‌ధ్య అనుబంధానికి ఇందులో ప్ర‌యారిటీ ఇచ్చారు ద‌ర్శ‌కుడు. మూవీ బృందం స‌క్సెస్ మీట్ ను నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా విజ‌య‌శాంతి(Vijayashanthi) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ మ‌ధ్య‌న సినిమాల గురించి త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న చెందింది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించింది.

Vijayashanthi Shocking Comments

ఉద్వేగ భ‌రితంగా మాట్లాడింది. సినిమాను దిగ‌జార్చేందుకు ఉద్దేశ పూర్వ‌కంగా ప్ర‌య‌త్నాలు చేయ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండి ప‌డింది. ఒక చిత్రం రూపు దిద్దుకోవాలంటే ఎంతో మంది తెర ముందు, తెర వెనుక క‌ష్ట ప‌డ‌తార‌ని, దీనిపై ఆధార‌ప‌డిన కుటుంబాలు కూడా ఉంటాయ‌ని తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికింది. ఎవ‌రైనా స‌మీక్ష‌లు రాసేట‌ప్పుడు, త‌మ అభిప్రాయాల‌ను పంచుకునేట‌ప్పుడు బాధ్య‌త‌తో మెల‌గాల‌ని హిత‌వు ప‌లికారు రాముల‌మ్మ‌.

త‌మ సినిమా ప‌ట్ల కొంత వ్య‌తిరేక‌త ప్ర‌చారం చేయ‌డం ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు. సినిమాను ప్రోత్స‌హించేలా ఉండాలే త‌ప్పా హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డం దారుణ‌మ‌న్నారు. ఇలాంటి వాటికి ఎంత‌గా పుల్ స్టాప్ పెడితే అంత మంచిద‌ని పేర్కొన్నార  విజ‌య శాంతి. కొంత మంది ఉద్దేశ పూర్వ‌కంగా సినిమాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ప‌ని చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఏది మంచి ఏది చెడు అనేది ప్రేక్ష‌కులు నిర్ణ‌యిస్తార‌ని, క‌థ‌లో బ‌లం ఉంటే చిత్రం త‌ప్ప‌కుండా ఆడుతుంద‌న్నారు.

Also Read : Hero Allu Arjun-Pooja Hegde :ఇండియ‌న్ ఐకాన్ స్టార్ తో బుట్ట‌బొమ్మ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com