Jana Nayagan : తమిళ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ కలిగిన హీరో దళపతి విజయ్. తను ఇటీవలే టీవీకే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించాడు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ దాని అనుబంధ సంస్థలపై నిప్పులు చెరిగాడు. త్రిభాషా అమలు విధానం పేరుతో తమ రాష్ట్రంపై, ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా చేస్తే చూస్తూ ఊరుకోనంటూ హెచ్చరించాడు. ఇప్పటికే తను నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఏకంగా 10 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇది భారత దేశ రాజకీయ చరిత్రలో అరుదు. ఇక సినీ రంగానికి సంబంధించి ఆఖరి సినిమా చేస్తున్నాడు. అదే జన నాయగన్ . తెలుగులో జన నాయకుడు.
Jana Nayagan Movie OTT Updates
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని చేజిక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడ్డాయి. ఈ ఒక్క మూవీ కోసం భారీ ఎత్తున రెమ్యూనరేషన్ దళపతి విజయ్(Thalapathy Vijay) కి ఇచ్చినట్లు టాక్. ఇక ఓటీటీ సంస్థలు పెద్ద ఎత్తున పోటీ పడ్డాయని, ఓ ప్రముఖ సంస్థ ఏకంగా జన నాయగన్(Jana Nayagan) కోసం ఏకంగా రూ. 121 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఇది కూడా రికార్డ్ అని చెప్పక తప్పదు. ఒక సినిమాకు ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం.
ఈ జన నాయకుడు చిత్రానికి కార్తీ మూవీ ఫేమ్ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. దళపతి విజయ్ ను భిన్నమైన రోల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ , సాంగ్ కెవ్వు కేక అనేలా ఉన్నాయి. భారీ ఎత్తున ఆదరణ నెలకొంది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు దళపతి విజయ్. ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. విడుదలయ్యాక సినిమా రిలీజ్ అయితే ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని అంచనా వేస్తున్నారు సినీ క్రిటిక్స్. ఇదిలా ఉండగా అమెజాన్ ఓటీటీ భారీ ధరకు చేజిక్కించుకున్నట్లు టాక్.
Also Read : HCU Issue-Renu Desai Shocking :హెచ్‌సీయూ విధ్వంసం రేణు దేశాయ్ ఆగ్రహం
