Virat Kohli Shocking Comments :స్వేచ్ఛ లేక పోవ‌డం వ‌ల్లే త‌ప్పుకున్నాడా..?

అజిత్ అగార్క‌ర్..ర‌విశాస్త్రితో కోహ్లీ ముచ్చ‌ట

Virat Kohli Shocking Comments

Virat Kohli : హైద‌రాబాద్ – ప్ర‌పంచ క్రికెట్ రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న అరుదైన క్రికెట‌ర్ భార‌త్ కు చెందిన విరాట్ కోహ్లీ. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో తాను టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేశాడు. విచిత్రం ఏమిటంటే గ‌త కొంత కాలం నుంచి త‌న‌కు హెడ్ కోచ్ గా ఉన్న గౌత‌మ్ గంభీర్ తో ప‌డ‌డం లేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఆట ప‌రంగా చూస్తే అద్భుత‌మైన ఫామ్ కొన‌సాగిస్తూ వ‌స్తున్నాడు. ఎవ‌రైనా బాగా ఆడుతుంటే ఇంకా భార‌త్ త‌ర‌పున ప్రాతినిధ్యం వహించాల‌ని కోరుకుంటారు.

Virat Kohli Shocking Comments

కానీ అనుకోకుండా ఇంకా రెండు మూడేళ్లు ఆడే స‌త్తా ఉన్న‌ప్ప‌టికీ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఉన్న‌ట్టుండి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. త‌ను త‌ప్పుకునే ముందు ఒక‌టికి రెండు సార్లు బీసీసీఐ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ తో , బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షాతో మాట్లాడిన‌ట్లు టాక్. కాగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ టెస్ట్ సీరీస్ లో భార‌త దేశానికి తిరిగి కెప్టెన్ కావాల‌ని కోరుకున్నాడ‌ని, కానీ త‌న‌కు ఆ ఆఫ‌ర్ ద‌క్క‌క పోవ‌డం నిరాశ‌కు గుర‌య్యాడ‌ని, అందుకే ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలా ఉండ‌గా బీసీసీఐ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. టెస్టు క్రికెట్ జ‌ట్టుకు యువ క్రికెట‌ర్ ను కెప్టెన్ గా ఎంపిక చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలిపింది. హెడ్ కోచ్ కూడా సీనియ‌ర్ల కంటే క్రికెట‌ర్ల వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. గత మూడు సంవ‌త్స‌రాలుగా విరాట్ కోహ్లీ పేల‌మైన ఫామ్ కొన‌సాగించాడు. విరాట్ స‌గ‌టున 32 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. ఇక నిర్ణ‌యం తీసుకునే ముందు మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రితో కూడా సంప్ర‌దించిన‌ట్లు టాక్.

Also Read : Sunil Gavaskar Shocking Comment :డీజేలు..డ్యాన్సింగ్ గ‌ర్ల్స్ వ‌ద్దు – స‌న్నీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com