Madha Gaja Raja Success :మ‌ద‌గ‌జ‌రాజా స‌క్సెస్ విశాల్ ఖుష్

భారీ వ‌సూళ్ల‌ను సాధించిన మూవీ

Madha Gaja Raja Success

Madha Gaja Raja : అదృష్టం ఎప్పుడు ఎవ‌రిని ఎలా వ‌రిస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ప్ర‌ధానంగా సినీ రంగానికి ఇది ఎక్కువ‌గా వ‌ర్తిస్తుంది. విచిత్రం ఏమిటంటే 12 ఏళ్ల త‌ర్వాత విడుద‌లైన మూవీ ఊహించ‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలవ‌డం సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఈ మ‌ధ్య‌న సంక్రాంతి పర్వ‌దినం సంద‌ర్బంగా విడుద‌లైంది మ‌ద‌గ‌జ‌రాజా(Madha Gaja Raja). ఇందులో విశాల్ రెడ్డితో పాటు అందాల ముద్దుగుమ్మ‌లు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, అంజ‌లి క‌లిసి న‌టించారు.

Madha Gaja Raja Movie Success

యాక్ష‌న్ , కామెడీ, ఎంట‌ర్ టైన్మెంట్ ప్ర‌ధానంగా మ‌ద‌గ‌జ‌రాజా దుమ్ము రేపింది. ఆశించిన దానికంటే అత్యధికంగా ఆద‌ర‌ణ చూర‌గొంది. బాక్సులు బ‌ద్ద‌లు అయ్యాయి కాసులతో. ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్, న‌టుడు సుంద‌ర్ సి. ఆర్థిక ఇబ్బందులు, కేసుల మ‌ధ్య మూవీ రిలీజ్ కాకుండా నిలిచి పోయింది. ఎట్ట‌కేల‌కు కోర్టు కీల‌క తీర్పు ఇవ్వ‌డంతో మ‌ద‌గ‌జ‌రాజా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

జ‌న‌వ‌రి 12న చిత్రం విడుద‌లైంది. సంతానం కామెడీ ఆక‌ట్టుకోగా, విశాల్ సూప‌ర్ గా న‌టించి మెప్పించాడు. ఇక విజ‌య్ ఆంటోనీ అద్భుతంగా సంగీతం ఇచ్చాడు. ఇందులో విశాల్ ప్ర‌త్యేకంగా ఓ పాట కూడా పాడాడు. ఇది నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇక మ‌ద‌గ‌జ‌రాజా బిగ్ హిట్ కావ‌డంతో ఓటీటీలో ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు.

Also Read : Tamannaah- Shocking Comment :క్రిప్టో క‌రెన్సీతో నాకేం సంబంధం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com