Modi Sensational Comment :భార‌త్ లో ఇంకొక‌రి జోక్యం స‌హించం

పీఓకే తిరిగి రావ‌డ‌మే మిగిలి ఉంది

Modi Sensational Comment

Modi : పాకిస్తాన్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది భార‌త విదేశాంగ శాఖ‌. ఈ మేర‌కు ఆ శాఖ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. త‌మ దేశం సార్వ‌భౌమ‌త్వం విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని చూస్తే స‌హించే ప్ర‌స‌క్తి లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఇక భార‌త్ కు మిగిలింది ఒక్క‌టేన‌ని , అది పీఓకే తిరిగి రావ‌డం మాత్ర‌మే మిగిలి ఉంద‌న్నారు. ఇందులో వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. త‌మ దేశంలో జోక్యం చేసుకోవాల‌ని చూస్తే ఊరుకోబోమ‌న్నారు.

PM Modi Sensational Comments

క‌శ్మీర్ విష‌యంలో, ఉగ్ర‌వాదుల‌ను అప్ప‌గించేంత వ‌ర‌కు పాకిస్తాన్ ఒప్పుకోనంత వ‌ర‌కు తాము ఆప‌రేషన్ సిందూర్ కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ అంశంలో ఇంకొక‌రి జోక్యాన్ని స‌హించేది లేద‌న్నారు. తాము ఎవ‌రి జోలికి వెళ్ల‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. రెండు నాల్క‌ల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తే మౌనంగా ఉంటామ‌ని అనుకోవ‌డం భ్ర‌మ అని పేర్కొన్నారు విక్ర‌మ్ మిస్రి. పాకిస్తాన్ కావాల‌ని కయ్యానికి కాలు దువ్వుతోంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ వేదిక‌గా ప్ర‌ధాని మోదీ(Modi) ఆధ్వ‌ర్యంలో హై లెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. ఇందులో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జై శంక‌ర్, భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్, సీడీఎస్, త్రివిధ ద‌ళాధిప‌తులు హాజ‌ర‌య్యారు. ఇందులో కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఇదే క్ర‌మంలో పాకిస్తాన్ గురించి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తో మోదీ మాట్లాడారు. భార‌త్ వైఖ‌రి ఏమిటో స్ప‌ష్టంగా చెప్పార‌ని తెలిపారు.

Also Read : PM Modi Strong Warning :పాకిస్తాన్ తో తాడో పేడో తేల్చుకుంటాం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com