తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు పొందాడు. తను స్వతహాగా రచయిత. ఎన్టీఆర్ బయో పిక్ తీశాడు. అది హిట్. అనుష్క శెట్టితో వేదం తీశాడు. ఇది విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు చారిత్రాక నేపథ్యంతో కూడిన కథను రూపొందించాడు. కథ, రచన, మాటలు అన్నీ . భారీ ఎత్తున ప్రారంభించారు దీనిని. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం నిర్మించాడు. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు క్రిష్ జాగర్లమూడి. తను తొలి భార్యతో పడలేక విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో డాక్టర్ ను పెళ్లి చేసుకున్నాడు.
ఇక తన కెరీర్ విషయానికి వస్తే తన టేకింగ్, మేకింగ్ లో వెరీ స్పెషల్. ప్రస్తుతం తను ఎందుకు తప్పుకున్నాడనే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా హరి హర వీరమల్లుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని నిర్మాత ఎంఎం రత్నం ప్రకటించాడు. అంచనాలు భారీ గా ఉన్నాయి. క్రిష్ జగర్లమూడి సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. కానీ ఇప్పటి వరకు ఈ దర్శకుడి గురించి అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు నిర్మాత కానీ నోరు మెదపడం లేదు.
క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాక ఎంఎం రత్నం సోదరుడి తనయుడు జయకృష్ణ తను తప్పుకున్నాక చిత్రాన్ని పూర్తి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో పాటు పాటలు కూడా విడుదలయ్యాయి. అయితే ఎక్కడా కూడా తొలుత కష్టపడిన క్రిష్ గురించి పట్టించుకోక పోవడం, తను మౌనంగా ఉండడం పట్ల చర్చ కొనసాగుతోంది.