దక్షిణాఫ్రికా – సుదీర్ఘ కాలం తర్వాత దక్షిణాఫ్రికా సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. తమను ఊరిస్తూ వస్తున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతిష్టాత్మకమైన టెస్టు ఛాంపియన్ షిప్ పోటీలో బలమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. దీని వెనుక ఒకే ఒక్కడు ఉన్నాడు అతడే టెంబా బావుమా. చూస్తే చిన్నోడు. కానీ చాలా గట్టోడు. ఒక రకంగా చెప్పాలంటే మొండోడు. తన కాలుకు గాయమైనా జట్టు కోసం మైదానంలోకి వచ్చాడు. ఆసిస్ బౌలర్లకు అడ్డు గోడలా నిలిచాడు. చివరకు అద్భుతమైన సెంచరీతో జట్టులో కీలక పాత్ర పోషించిన మార్క్రామ్ తో కలిసి విజయ తీరాలకు చేర్చడంలో సక్సెస్ అయ్యాడు.
దీంతో దక్షిణాఫ్రికా జట్టుకు భారీ ప్రైజ్ మనీ దక్కింది. ఇక టెంబో బావుమా సక్సెస్ వెనుక తన భార్య ఫిలా లోబి ఉందన్నది వాస్తవం. తను చాలాసార్లు అవమానాలు ఎదుర్కొన్నాడు. వర్ణ వివక్షకు గురయ్యాడు. తన జట్టును ఫైనల్ దాకా తీసుకు వెళ్లడంలో తన నాయకత్వ ప్రతిభ దాగి ఉంది. రూ. 30 కోట్ల ప్రైజ్ మనీని తన జట్టుకు ఒంటి చేత్తో అందించాడు.
ఫైనల్లో, బావుమా కెప్టెన్‌గా తన వ్యూహాత్మక నాయకత్వ నైపుణ్యాలను మాత్రమే కాకుండా, తన బ్యాట్స్‌మెన్‌షిప్‌ను కూడా ప్రదర్శించాడు. ఇక బావుమా భార్య ఫిలా లోబి వ్యాపారవేత్త. ఆమె పరోపకారిగా గుర్తింపు పొందింది. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత లోబీ ప్రాపర్టీస్‌ను స్థాపించింది. లోబీ ప్రాపర్టీస్ అనేది జోహన్నెస్‌బర్గ్ , కేప్ టౌన్‌లలో ఒక విలాసవంతమైన రియల్ ఎస్టేట్ సంస్థ. 2018లో, ఆమె పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఫిలా లోబీ ఫౌండేషన్‌ను స్థాపించింది.
దాదాపు నాలుగు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత 2018లో ఒకరినొకరు వివాహం చేసుకున్నారు.
కాగా టెంబా బావుమా నికర విలువ దాదాపు రూ.10 కోట్లుగా అంచనా వేశారు.