Yakshini: డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లతో ఓటీటీ అభిమానులకు ఫేవరేట్ గా మారిన డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్… ఇప్పుడు ‘యక్షిణి’ మరో సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ‘ఆర్కా మీడియా వర్క్స్’ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా… అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ మార్ని తెరకెక్కిస్తున్నారు.
Yakshini Web Series..
ఈ నేపథ్యంలో “యక్షిణి(Yakshini)” కమింగ్ సూన్ అంటూ ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇప్పటి దాకా వచ్చిన సోషియో ఫాంటసీ సినిమాలు, వెబ్ సిరీస్ లకు భిన్నమైన కాన్సెప్ట్ తో “యక్షిణి”ని రూపొందించిన ఆర్కా మీడియా వర్క్స్… ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో ఈ ‘యక్షిణి’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.
బుల్లితెర సీరియల్స్ తో పాటు బాహుబలి(Baahubali) వంటి భారీ సినిమా ఫ్రాంచైజీని నిర్మించిన ఆర్కా మీడియా ప్రస్తుతం రెండు సినిమాలను నిర్మించడంతో పాటు బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. బాహుబలి తర్వాత కాస్త సైలెంట్ గా ఉన్న ఆర్కా మీడియా నిర్మాతలు ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఆక్సీజన్ మరియు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాలను ప్రకటించారు. మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాసిజల్ ఈ సినిమాల్లో నటిస్తన్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు ఒక వైపు మేకింగ్ లో ఉండగానే మరో వైపు ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భాగస్వామ్యంతో ‘యక్షిణి’ అనే వెబ్ సిరీస్ ను మొదలు పెట్టారు.
ఈ మధ్య కాలంలో సోషియో ఫాంటసీ మరియు హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు మరియు సినిమాలకు మంచి స్పందన వస్తుంది. అందుకే ఈ వెబ్ సిరీస్ ను ఆర్కా మీడియా వారు మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే విడుదల అయిన ప్రీ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read : Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రెండు భారతీయ సినిమాలు !