Allu Arjun-Pushpa 2 : బన్నీ ‘పుష్ప 2’ సినిమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ఈ ట్వీట్ ప్రతి ట్వీట్ లతో నంద్యాలలోనే కాకుండా సీమ జిల్లాల్లో చర్చ నడుస్తుంది...

Hello Telugu - Allu Arjun-Pushpa 2

Allu Arjun : టాలీవుడ్ అగ్ర నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు, నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కు మధ్య ఫ్రెండ్షిప్ బంధం మరింత బలపడుతోంది. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ విషెస్ చెప్పారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే.”తెరపై మీ విశ్వరూపం చూడటానికి ఎదురుచూస్తున్నాం బ్రదర్ అంటూ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ థాంక్స్ బ్రదర్ మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ప్రతి ట్వీట్ లతో నంద్యాలలోనే కాకుండా సీమ జిల్లాల్లో చర్చ నడుస్తుంది. కాగా అల్లు అర్జున్, శిల్పా రవి(Silpa Ravi) మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సందర్భంగా కూడా వీరిద్దరి స్నేహబంధం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేల మంది ర్యాలీతో శిల్ప రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇదే విషయమై అర్జున్ పై కేసు నమోదవుగా కోర్టులో ఇటీవలే క్వాష్ అయింది. తాజాగా అల్లు అర్జున్ పుష్ఫ 2 సినిమాకు శిల్పా రవి అడ్వాన్స్ విషెస్ తెలియ జేయడం, ఇది చూసిన బన్నీ వెంటనే రిప్లై ఇవ్వడంతో సీమ జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Allu Arjun Friend Congratulated..

ఐకాన్స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 రిలీజ్ కు మరో రెండు వారాల సమయమే ఉంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ క్రేజీ సీక్వెల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ షేక్ అవుతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యంత వేగంగా 40 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇంతవరకు భారతీయ సినిమా చరిత్రలోనే ఏ మూవీ కూడా ఇలాంటి రికార్డ్ సాధించలేదు.

Also Read : Nagarjuna : నాగార్జున పరువు నష్టం కేసు కు కౌంటర్ ఇచ్చిన కొండా సురేఖ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com