Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పట్ల కన్నడ సూపర్ స్టార్ ..పాన్ ఇండియా హీరో యశ్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తను తెలుగు, హిందీ మూవీస్ లో నటించింది. డార్లింగ్ ప్రభాస్ తో కలిసి ఆది పురుష్ లో నటించింది..మెప్పించింది. ఇద్దరూ పోటీ పడి నటించినా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ప్రిన్స్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేనులో తళుక్కున మెరిసింది. వినయ విధేయ రామలో కూడా కీలక పాత్రలో పోషించింది.
Kiara Advani…
ఆయా సినిమాలు బాక్సాఫీసులు బద్దలు కొట్టక పోయినా తన కెరీర్ మాత్రం సాఫీగా సాగిపోతోంది. జయాపజయాలతో పని లేకుండా స్టార్స్ సరసన సినిమా ఛాన్స్ లు కొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కన్నడ రైజింగ్ స్టార్ యశ్ టాక్సిక్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 25 శాతానికి పైగా షూటింగ్ కూడా పూర్తయినట్లు టాక్. ఈ చిత్రంలో కియారా అద్వానీ(Kiara Advani) కూడా నటిస్తోంది. అయితే ఇందులో హీరో రోల్ కు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుందట. కేవలం అప్రధాన్య పాత్ర వరకే తను పరిమతం అవుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే కియారా అద్వానీ ఆశించిన రీతిలో నటించడం లేదంటూ యశ్ అసంతృప్తిలో ఉన్నాడని, తనను మారిస్తే బెటర్ అంటూ మూవీ మేకర్స్ కూడా చర్చించినట్లు సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవేళ గనుక కియారా తప్పుకుంటే ఆమె కెరీర్ కు బిగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పక తప్పదు.
Also Read : Hero Bunny-Allu Aravind:బన్నీ చెప్పాకే దేవిశ్రీని ఓకే చేశా