అమరావతి – ఏపీలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు జనాదరణ పెరుగుతోందన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్ళు ముందుకు రావాలన్నారు. నాయకత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు వస్తే చరిత్ర సృష్టించ వచ్చని అన్నారు. రాజకీయ ఆకాంక్ష ఉన్న వాళ్ళు, భవిష్యత్ లో MLA అవ్వాలని అనుకుంటున్న వాళ్లకు స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. అన్ని రిసోర్స్ కలిగిన వాళ్ళు ముందుకు రావాలన్నారు. అటువంటి వాళ్ళకు ప్లాట్ఫామ్ కల్పించేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు షర్మిలా రెడ్డి.
కాంగ్రెస్ లో కార్యకర్తలు కమిట్ మెంట్ తో కూడిన వాళ్ళు ఉన్నారని అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండాను నెత్తిన మీద పెట్టుకొని మోసిన వాళ్ళు మీరంతా అని కొనియాడారు. ప్రతి జిల్లాల్లో వాళ్ల తపన చూస్తే ఎంతో అభిమానం కలిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. గ్రౌండ్ లెవల్ లో మంచి నాయకత్వం ఉంటే ఆదరించే ప్రజలు కోట్లలో ఉన్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అని..అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అని నమ్మకంతో ఉన్నారని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన ఏకైక పార్టీ తమ పార్టీ అని అన్నారు. ఇవాళ దేశం అన్ని రంగాలలో అభివృద్ది చెందడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఏపీలో కూటమి సర్కార్ బక్వాస్ అంటూ కొట్టి పారేశారు.