అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. ఏం సాధించారని ఏడాది పాలన పేరుతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ఏడాదిలో సాధించినది గొప్పలు చెప్పడమే. ఉద్ధరించినట్లు విజయపత్రం ఇచ్చారంటూ మండిపడ్డారు. ఎన్నికల ప్రచార పత్రంలా ఉంది చంద్రబాబు ఏడాది విజయపత్రం అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చింది ఎంత ? సాధించింది ఎంత ? ఏడాది గడిచినా సూపర్ సిక్స్ కి దిక్కు లేదన్నారు. ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదన్నారు. పండుగలు పేరు చెప్పి కాలయాపన చేశారంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి.
నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగాల కల్పన లేదు. రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. ఎన్నికల మానిఫెస్టో అంటే 5 ఏళ్ల కాలపరిమితి ఉండాలి. ఇష్టం వచ్చినప్పుడు అమలు చేయడం కాదన్నారు. తల్లికి వందనం కింద రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. 67 లక్షల మందికి ఇస్తారట. అంటే మిగిలిన 20 లక్షల మంది విద్యార్థులను మోసం చేయడమేనని అన్నారు. మొత్తం 87 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాలన్నారు. ఇక అన్నదాత సుఖీభవ కూడా మోసమేనని ఎద్దేవా చేశారు షర్మిలా రెడ్డి. రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నారు. కత్తెర పేరుతో… 45 లక్షల మంది రైతులకు ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
ఉద్యోగాల పేరుతో బాబు చేసింది మోసమే. ఏడాది గడిచినా మహిళా శక్తి పథకం ఊసే లేదు. ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం అన్నారు. కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. సూపర్ సిక్స్ కాకుండా.. దాదాపు 140 కి పైగా హామీలు ఇచ్చారన్నారు. ప్రతి ఏటా జనవరిలో క్యాబ్ క్యాలెండర్ అన్నారు. జనవరి దాటినా జాబ్ క్యాలెండర్ రాలేదన్నారు షర్మిలా రెడ్డి.